నిఖిల్ 18 పేజెస్ రిలీజ్ డేట్ లాక్..!

కార్తికేయ 2 తో సెన్సేషనల్ హిట్ అందుకున్న నిఖిల్ ప్రస్తుతం సూర్య ప్రతాప్ డైరక్షన్ లో 18 పేజెస్ సినిమా చేస్తున్నాడు.సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించారు.

 Nikhil 18 Pages Release Date Fix , Nikhil, 18 Pages, Anupama Parameswaran, Geeth-TeluguStop.com

సినిమా పూర్తై చాలారోజులు అవుతున్నా సరైన రిలీజ్ డేట్ దొరక్క ఆగిపోయింది.ఫైనల్ గా 18 పేజెస్ రిలీజ్ డేట్ లాక్ చేశారు.

ఈ ఏడాది చివర్లో డిసెంబర్ 23న క్రిస్ మస్ కానుకగా 18 పేజెస్ సినిమా వస్తుంది.ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది.

ఆల్రెడీ కార్తికేయ 2 తో సూపర్ హిట్ అందుకున్న ఈ జోడీ మరో సినిమాతో వస్తున్నారు.నిఖిల్ 18 పేజెస్ కంప్లీట్ లవ్ స్టోరీగా వస్తుంది.ఈ సినిమాతో కూడా నిఖిల్ మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంటాడని అంటున్నారు.సుకుమార్ కథ అంటే ఖచ్చితంగా అది హిట్ అని చెప్పొచ్చు.

కుమారి 21ఎఫ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సూర్య ప్రతాప్ ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు.కార్తికేయ 2 తో వచ్చిన క్రేజ్ వల్ల నిఖిల్ 18 పేజెస్ కి భారీ బిజినెస్ జరుగుతున్నట్టు తెలుస్తుంది.

ఓ విధంగా ఆ సినిమా వల్ల ఈ సినిమా నిర్మాతలు లాభ పడ్డారని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube