మానవాళికి ఫ్లయింగ్ సాసర్ల వంటి గుర్తు తెలియని వస్తువులు తిరుగుతుండటం మిస్టరీగా మారాయని చెప్పొచ్చు.ఈ క్రమంలోనే యూఎఫ్ఓల గుట్టు విప్పేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఓ స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసింది.
ఈ బృందంలో వివిధ శాస్త్ర విభాగాలకు చెందిన 16 మందికి స్థానం కల్పించింది.అదేవిధంగా ఈ టీమ్ కు డేవిడ్ స్పెర్గెల్ నాయకత్వం వహించనున్నారు.
యూఎఫ్ఓల ఉనికిపై 9 నెలల పాటు సాగే ఈ అధ్యయనం అక్టోబరు 24న ప్రారంభం కానుందని నాసా వెల్లడించింది.ఈ ప్రత్యేక బృందం రూపొందించే నివేదికను వచ్చే ఏడాది బహిర్గతం చేయనున్నారని స్పష్టం చేసింది.
అయితే యూఎఫ్ఓలకు సంబంధించి ఇప్పటిదాకా నిర్దిష్ట ఆధారాలు లేవు.