న్యూయార్క్ వీధుల్లో ఇండియన్ ఫ్యామిలీ పెళ్లి సందడి... కాలుకదిపిన అమెరికన్లు, వీడియో వైరల్

భారతదేశంలో వివాహ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారన్న సంగతి తెలిసిందే.దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలాగా వివాహాలు జరుగుతాయి.

 Indian Family Wedding Celebrations In New York, Video Goes Viral , Indian Family-TeluguStop.com

ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లినా మూలాలు మరిచిపోని భారతీయులు పెళ్లిళ్ల విషయంలోనూ సాంప్రదాయాన్ని ఫాలో అవుతూనే వున్నారు.ఇక మేళ తాళాలతో.

తప్పిట్లతో.బాణాసంచా పేలుళ్లతో గుర్రం మీద కూర్చొన్న పెళ్లికుమారుడిని పెళ్లి పందిరి వద్దకు అట్టహాసంగా తీసుకువచ్చే వేడుకే బరాత్‌.

బంధువులు, సన్నిహితులు, తెలిసినోళ్లు డ్యాన్సులు చేస్తూ ఉంటే.దానిని చూస్తోన్న వారు కూడా పూనకంతో ఊగిపోతూ కాలు కదిపే సంబరంలో ఉన్న మజానే వేరు.

గతంలో ఉత్తర భారతదేశానికే పరిమితమైన ఈ బరాత్.కాలక్రమంలో దేశవ్యాప్తంగా విస్తరించింది.

మన తెలుగు నాట నైజాం ఏరియాలో పెళ్లి బరాత్‌లకు విశేష ప్రాధాన్యత వున్న సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహించేందుకు ఖర్చుకు కూడా వెనుకాడవు కొన్ని కుటుంబాలు.

అలాంటి పెళ్లి బరాత్ న్యూయార్క్ వీధుల్లో జరిగితే… ఊహించుకోవడానికే ఆశ్చర్యంగా వుంది కదూ.కానీ ఇది నిజంగానే చోటు చేసుకుంది.ఇండియన్ కమ్యూనిటీకి చెందిన ఓ కుటుంబం సంప్రదాయ దుస్తులు ధరించి న్యూయార్క్ వీధుల్లో డ్యాన్సులు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.అటు అమెరికన్లు కూడా భారతీయ పాటలకు హుషారుగా స్టెప్పులు వేస్తున్న దృశ్యాలను ఆ వీడియోలో గమనించవచ్చు.

సూరజ్ పటేల్ అనే భారత సంతతి వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మేరకు వీడియోను షేర్ చేశాడు.

డెమొక్రాటిక్ పార్టీకి చెందిన సూరజ్ పటేల్ అక్కడ అటార్నీ జనరల్‌గా పనిచేస్తున్నారు.ఈయన గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వద్ద పనిచేశారు.సూరజ్ సోదరుడి పెళ్లి వేడుక సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది.

ఈ వివాహం కోసం తన కుటుంబం, బంధువులు ఇక్కడకు చేరుకున్నారని.న్యూయార్క్ నగర వీధుల్లో ఎంతో ప్రేమ వుందని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో సూరజ్ పటేల్ పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube