టీడీపీ అధినేత చంద్రబాబుపై సీపీఐ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.చంద్రబాబు రాష్ట్రంతో పాటు దేశ ప్రయోజనాల పైన దృష్టి పెట్టాలని సూచించారు.
బీజేపీ పై పోరాడటానికి పవన్, చంద్రబాబు మిగతా రాజకీయ పార్టీలన్నీ ఏకం కావాలని కోరారు.ప్రధాని మోడీ అదే విధంగా అమిత్ షా సపోర్టు లేకపోతే జగన్ సీఎం అయ్యి ఉండేవాడు కాదని.
అన్నారు.వాళ్ళ సపోర్ట్ లేకపోతే జగన్ ముఖ్యమంత్రి పదవిలో ఒక్కరోజు కూడా ఉండలేరని విమర్శించారు.
జగన్ పై కేసులు ఉన్నా గాని చర్యలు తీసుకోకపోవటానికి ప్రధాన కారణం.వాళ్ల మధ్య రహస్య దోస్తీ నడుస్తుంది అని సీపీఐ రామకృష్ణ ఆరోపించారు.ఇదిలా ఉంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు కావాలని చంద్రబాబు పిలుపునివ్వడం తెలిసిందే.ఈ క్రమంలో సీపీఐ రామకృష్ణ ముందుకు వచ్చి టీడీపీతో కలిసి పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇలాంటి తరుణంలోబీజేపీ అగ్రనేతలు ఇంకా సీఎం జగన్ పై రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.