హైదరాబాద్ లో విషాద ఘటన జరిగింది.మియాపూర్ లో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మాతృశ్రీ నగర్ లో 20 అంతస్థుల భవనం పై నుంచి దూకి యువతి ఆత్మహత్యకు పాల్పడింది.డిగ్రీ చదువుతున్న కోమలిక మంగళవారం సాయంత్రం కాలేజ్ నుంచి ఇంటికొచ్చింది.
నాకు చనిపోవాలని అనిపిస్తుంది.నా జీవితాన్ని చాలించుకుంటున్నా నని లేఖ రాసి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.