బిగ్ బాస్ సీజన్1 నుంచి బిగ్ బాస్ సీజన్5 వరకు అన్ని సీజన్లు పరవాలేదనే స్థాయిలో రేటింగ్స్ ను సొంతం చేసుకుని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.బిగ్ బాస్ షో సీజన్6 మాత్రం ప్రేక్షకులను అస్సలు ఆకట్టుకోవడం లేదు.
లాంఛ్ ఎపిసోడ్ నుంచి బిగ్ బాస్6 ప్రేక్షకులను నిరాశపరుస్తుండగా ఈ షోకు ఆశించిన స్థాయిలో రేటింగ్స్ రాకపోవడం ఫ్యాన్స్ ను మరింత బాధ పెడుతోంది.
అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్లలో ఒకరైన శ్రీహాన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
బిగ్ బాస్ హౌస్ లో ఎవరికీ సీరియస్ నెస్ లేదని శ్రీహాన్ షాకింగ్ కామెంట్లు చేశారు.హౌస్ లో ఉన్న చాలామంది కంటెస్టెంట్లకు అసలు బిగ్ బాస్ షో అంటే ఏంటో కూడా తెలియదని శ్రీహాన్ చెప్పుకొచ్చారు.
సమయానికి తిని పడుకోవడం సోది ముచ్చట్లు చెప్పుకోవడం మాత్రమే తెలుసని శ్రీహాన్ కామెంట్లు చేశారు.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న చాలామంది కంటెస్టెంట్లకు బిగ్ బాస్ అంటే ఏంటో తెలియకపోవడంతో ఈ షో అంటే ఏంటో కంటెస్టెంట్లకు చెప్పాలని శ్రీహాన్ చెప్పుకొచ్చారు.శ్రీహాన్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ షో సీజన్6 ఫ్లాప్ అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సీజన్ లో టాస్క్ లు ఆకట్టుకునేలా లేవని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.బిగ్ బాస్ షో సీజన్6 సక్సెస్ కాకపోవడం గురించి నాగార్జున ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
బిగ్ బాస్ షో తర్వాత సీజన్లు ఉండకపోవచ్చని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ షో కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉండటంతో నిర్వాహకులు సైతం ఈ షో విషయంలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.







