బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు

మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి.చండూరులో ఫోన్ పే తరహాలో కాంట్రాక్ట్ పే అంటూ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి.రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ రాజగోపాల్ రెడ్డికి కేటాయించారంటూ పోస్టర్లలో పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు.అనంతరం ఆయనకు రూ.18 వేల కాంట్రాక్ట్ వచ్చిన నేపథ్యంలో అమ్ముడు పోయారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలోనే రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లను అంటించినట్లు సమాచారం.

 Posters Against Bjp Candidate Rajagopal Reddy-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube