కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి వచ్చిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్.ఈ సినిమాను మావెరిక్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించాడు.
ఈయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా ఈ సినిమాను ఎప్పటి నుండో తెరకెక్కించాలి అని అనుకున్న ఇప్పటికి అది సాధ్యం అయ్యింది.ఈ సినిమా సెప్టెంబర్ 30న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
ఈ సినిమా మౌత్ టాక్ ఎలా ఉన్న ఓపెనింగ్స్ మాత్రం బాగా వచ్చాయి.
ముందు నుండి బాగా ప్రొమోషన్స్ చేయడంతో అన్ని చోట్ల మంచి బజ్ తోనే రిలీజ్ అయ్యింది.
దీంతో ఈ సినిమా మొదటి రోజు బాగానే వసూళ్లు చేసింది.అలాగే వీకెండ్ కావడంతో శని, ఆది వారాలు కూడా ఈ సినిమాకు ప్లస్ అనే చెప్పాలి.
ఈ సినిమాకు మరో బలమైన సినిమా పోటీ లేకపోవడం కూడా కలిసి వచ్చింది.ఇక ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా బాగానే అలరిస్తుంది అని తెలుస్తుంది.
ఇక తాజాగా ఈ సినిమా కలెక్షన్స్ వివరాలు బయటకు వచ్చాయి.ఐదు రోజుల పాటు ఏ సినిమా రిలీజ్ కాకపోవడంతో ఈ సినిమాకు ప్లస్ అయ్యింది.దీంతో ఈ సినిమా కలెక్షన్స్ భారీగానే వచ్చాయి.5 రోజుల్లోనే ఈ సినిమా రూ.300 కోట్ల రూపాయల మార్క్ క్రాస్ చేసినట్టు తెలుస్తుంది.ఇంకా ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింప బడుతుంది.
ఒక్క తమిళనాటే ఈ సినిమా 100 కోట్ల మార్క్ క్రాస్ చేసింది.మణిరత్నం తన కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధిస్తున్నాడు.
మొదటిరోజు ఈ సినిమా మిశ్రమ స్పందన వచ్చిన రెండవ రోజు నుండి క్రమంగా ఈ సినిమా కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి.ఇక ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే.
మొదటి పార్ట్ బాగానే ఆకట్టు కోవడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ ను నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నారు.ఇక ఈ సినిమాలో చియాన్ విక్రమ్, హీరో కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, శోభిత దూళిపాళ్ల వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు.
లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాకు ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు.చూడాలి మరి ఈ సినిమా మొత్తం ఎంత వసూళ్లు సాధిస్తుందో.