విశాఖ రైల్వే జోన్ వ్యవహారంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.కొత్త రైల్వే జోన్ నిర్మాణాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించిందన్న ఆయన.
దీనిపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.నిన్నటి కేంద్ర హోంశాఖ సమావేశంలో రైల్వే జోన్ అంశం చర్చకు రాలేదని తెలిపారు.
సమస్యల పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ కావాలన్నారు.వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కేసీఆర్, జగన్ కలుస్తారా అని ప్రశ్నించారు.
ఏపీకి అన్యాయం జరుగుతుంటే చర్చించే తీరిక జగన్ కు లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.