సేవలకు సెలవు : ఏపీ టీడీపీ కి గుడ్ బై చెప్పిన తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త ?

దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఖచ్చితంగా రాజకీయ వివాహ కర్తలను నమ్ముకుంటున్నాయి.గతంలో ఈ తరహా సేవలు ఎక్కడా కనిపించేవి కాదు .

 Telangana Congress Strategist Who Said Goodbye To Ap Tdp Tdp, Chandrababu, Jagan-TeluguStop.com

ఆయా పార్టీల అగ్ర నాయకులే వ్యవహాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిలను బేరీజు వేసుకుంటూ,  పార్టీ నాయకులతో చర్చిస్తూ,  ఎన్నికల్లో గెలిచేందుకు అనేక నిర్ణయాలను తీసుకుంటూ ఉండేవారు.అయితే గత రెండు మూడు దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాజకీయ వ్యూహకర్తల  పాత్ర కీలకంగా మారింది.

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కానీ , వివిధ రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న ప్రాంతీయ పార్టీలు కానీ, రాజకీయ వ్యూహకర్తల కారణంగానే అధికారంలోకి రావడంతో వీరి ప్రాధాన్యం రోజు రోజుకు పెరుగుతోంది.

        ఇదిలా ఉంటే ఏపీ టిడిపికి రాజకీయ వ్యూహకర్తలుగా రాబిన్ శర్మతో పాటు,  తెలంగాణ కాంగ్రెస్ కు వ్యూహ కర్తగా ఉన్న సునీల్ కానుగోలు ఏపీ టీడీపీకి వ్యూహలు అందిస్తున్నారు.

వాస్తవంగా టిడిపి అధినేత చంద్రబాబు రాజకీయ వ్యూహాలు ఆషామాషీగా ఉండవు.  ప్రత్యర్థులను ఇరుకున పెట్టడంలో బాబుకు మించిన వారు ఉండరు.

అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజారిటీతో విజయం సాధించడానికి ప్రశాంత్ కిషోర్ అనే రాజకీయ వ్యూహకర్త కారణం కావడం,  టిడిపి ఘోరంగా ఓటమి చెందడంతో బాబు సైతం తప్పనిసరి పరిస్థితుల్లో వ్యూహకర్తలుగా రాబిన్ శర్మతో పాటు,  సునీల్ కానుగోలు ను నియమించారు.  వీరిద్దరూ వేరువేరుగా తమ వ్యూహాలను టిడిపికి అందిస్తున్నారు అయితే వీరిద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరడంతో బాబు వద్దే పంచాయతీ జరిగిందట.
       

Telugu Chandrababu, Jagan, Sunil Kanugolu, Tdp Stragist, Ysrcp-Politics

దీంతో ఇద్దరిలో ఎవరు కావాలో తేల్చుకోవాలి అంటూ సునీల్ కానుగోలు రాబిన్ శర్మ కు ప్రతిపాదన పెట్టగా,  బాబు మరికొంత కాలం పాటు వేచి చూద్దామని చెప్పారట.  సునీల్ కానుగోలు తాను వ్యూహకర్త గా తప్పుకుంటున్నట్లు బాబుకు చెప్పేసారట.ఒకే సమయంలో ఇద్దరు రాజకీయ వ్యవకర్తలు ఒకే పార్టీకి పనిచేయడం ఇబ్బంది అవుతుందని సునీల్ నిర్ణయించుకోవడంతోనే టిడిపి వివాహకత బాధ్యతలు నుంచి తప్పుకున్నట్లు సమాచారం.సునీల్ కానుగోలు విషయానికొస్తే బళ్లారికి చెందిన ఈయన అమెరికాలో చదువుకున్నారు.గతంలో ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ టీం లోను పనిచేశారు  2014 ఎన్నికలకు ముందు అసోసియేషన్ ఆఫ్ బ్రిలియంట్ మైండ్స్ పేరుతో కన్సల్టెంట్ గా పనిచేశారు .2014లో బిజెపి కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఈ సంస్థ కూడా ప్రధానుపాత్ర పోషించింది.ఏఐ డి ఎం కే కు , నితీష్ కుమార్ కు పనిచేశారు.  ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ తో పాటు టిడిపికి రాజకీయ వ్యవహర్తగా పని చేస్తుండగా ఇప్పుడు టీడీపీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube