సినీ ఇండస్ట్రీలో చాలామంది నటులు ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఆ తర్వాత కొద్ది రోజులు కనిపించకుండా పోయి మళ్లీ నటనపై ఉన్న ఆసక్తితో ఎంట్రీ ఇచ్చిన వారు ఎంతో మంది ఉన్నారు.అటువంటి వారిలో ఒకప్పటి హీరో, కమెడియన్, నటుడు అయిన వేణు తొట్టెంపూడి కూడా ఒకరు.
సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు నటుడిగా ఒక వెలుగు వెలిగిన వేణు తొట్టెంపూడి ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే.ఇక తొమ్మిదేళ్ల విరామం తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు వేణు తొట్టెంపూడి.
అయితే వేణు తొమ్మిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వాలి అన్న ఆలోచన మంచిదే అయినప్పటికీ ఆ రీ ఎంట్రీ కి ఎంచుకున్న సినిమా సబ్జెక్ట్ అన్నది ప్రధానం అని చెప్పవచ్చు.
అయితే దాదాపు తొమ్మిది ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన వేణు తొట్టెంపూడి రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో పోలీస్ పాత్ర తన కెరీర్ కు ఏ మాత్రం ఉపయోగపడదు అన్న విషయాన్ని మాత్రం గ్రహించలేకపోయాడు.
అలా వేణు చేసిన ఒక చిన్న మిస్టేక్ తో ఆయన రీ ఎంట్రీ కి అర్థమే లేకుండా పోయింది.అయితే వేణు తొట్టెంపూడి కంటే ఇంతకుముందు పలువురు నటీనటులు ఇలా రీఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ ను అందుకున్నారు.
అందుకు ఉదాహరణగా చిరంజీవి, విజయశాంతి, జగపతిబాబు లాంటి వారిని చెప్పుకోవచ్చు.
అయితే అలా రీఎంట్రీ ఇచ్చిన వారి సినిమాలు ఆ తర్వాత వాళ్ళ పరిస్థితిని చూసి కథ విషయంలో కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటే వేణు తొట్టెంపూడి లైఫ్ ఇంకా బాగుండేది అని అభిమానులు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా వేణు తొట్టింపూడి కటౌట్ కి మంచి మంచి అవకాశాలే వచ్చి ఉండేవి.కానీ ఆయన చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఇప్పుడు వేణుకి ఆఫర్స్ అన్నవి లేకుండా పోయాయి.
మరి వేణు ఇకముందు భవిష్యత్తులో వచ్చే పాత్రల ఎంపిక విషయంలో అయినా ఆచితూచి వ్యవహరించి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఉన్న కథలను ఎంచుకుంటాడో లేదో చూడాలి మరి.