విజయనగరం జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది.బొండపల్లి మండలం కొత్తపనసలపాడులో ఆవుపై దాడికి పాల్పడింది.
రెండు రోజులక్రితం దత్తిరాజేరు మండలం ఎస్.చింతలవలసలోని పశువులపై దాడి చేసింది.ఈ క్రమంలో జిల్లాలో సంచరిస్తున్నది బెంగాల్ టైగర్ అని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.మెంటాడ, శృంగవరపుకోట, కొత్త వలస, వేపాడుతో పాటు వంగల మండలాల్లోని కొండ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు గుర్తించారు.
ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.