ఈ నెల 25వ తేదీన థియేటర్లలో విడుదలైన లైగర్ సినిమా ఏ రేంజ్ లో ఫ్లాప్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు.రెండో రోజు ఈ సినిమా కలెక్షన్లు లక్షల్లో ఉన్నాయంటే ఈ సినిమా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో సులభంగా అర్థమవుతుంది.
అయితే లైగర్ సినిమా డిజాస్టర్ అయినా ఈ సినిమా బాహుబలి1 రికార్డులను బ్రేక్ చేసి వార్తల్లో నిలిచింది.హిందీలో బాహుబలి1 తొలిరోజు కలెక్షన్ల కంటే లైగర్ మూవీ తొలిరోజు కలెక్షన్లు ఎక్కువ మొత్తంలో ఉండటం గమనార్హం.
హిందీలో లైగర్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు 5.75 కోట్ల రూపాయలు కాగా బాహుబలి1 ఓపెనింగ్ డే రికార్డ్ కంటే ఈ మొత్తం ఎక్కువ కావడం గమనార్హం.అయితే తొలిరోజు భారీస్థాయిలో కలెక్షన్లు వచ్చినా హిందీలో కూడా క్రిటిక్స్ ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు ఇవ్వడంతో ఈ సినిమాకు భారీ మొత్తంలో నష్టాలు రావడం ఖాయమైంది.భాషతో సంబంధం లేకుండా లైగర్ బయ్యర్లు భారీ మొత్తంలో నష్టపోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
లాంగ్ వీకెండ్ లైగర్ సినిమాకు ఏ మాత్రం ప్లస్ అయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు.డిజాస్టర్ టాక్ తో హిందీలో లైగర్ ఆ స్థాయిలో కలెక్షన్లను సాధించడం కూడా గొప్పేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమాలలో నటించడంలో తప్పు లేదని అయితే అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథలను కూడా ఎంపిక చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
విజయ్ దేవరకొండకు లైగర్ ఫ్లాపైనా కెరీర్ పై ఆ ప్రభావం పడే అవకాశాలు అయితే లేవని తెలుస్తోంది.విజయ్ దేవరకొండ కొత్త ప్రాజెక్ట్ లతో సత్తా చాటాలని మరి కొందరు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఈ ప్రాజెక్ట్ లు విజయ్ దేవరకొండ కోరుకున్న భారీ సక్సెస్ ను అందిస్తాయో లేదో చూడాల్సి ఉంది.