సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కొందరు స్టార్ హీరోలు హీరోయిన్లు వదులుకున్న సినిమాలను వేరే హీరో హీరోయిన్లు చేసి బ్లాక్ బస్టర్ హిట్లర్ అందుకుంటూ ఉంటారు.ఆ సినిమా విడుదలైన తర్వాత అటువంటి మంచి అవకాశం మిస్ చేసుకున్నందుకు బాధపడుతూ ఉంటారు.
అయితే ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో అలా ఎన్నో సినిమాలు తెరకెక్కిన విషయం తెలిసిందే.అలా హీరో రవితేజ కూడా ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశాడు.
రవితేజ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇతర నటినటులని స్టార్ గా నిలబెట్టాయి అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
తాజాగా అటువంటి సంఘటన గురించి బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ బాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కాపీ విత్ కరణ్ షోలో పాల్గొంది.
కాగా చిన్న సినిమాలలో నటిస్తూ గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్న కియారా అద్వానీ కి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన లస్ట్ స్టోరీస్ తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న విషయం తెలిసిందే.కాగా ఆ వెబ్ సిరీస్ లో వైబ్రేటర్ ను ఉపయోగించే ఒక బోల్డ్ సన్నివేశం ఉంటుంది.
ఆ సన్నివేశంలో కియారా అద్వానీ అద్భుతంగా నటించడం వల్లే ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది కియారా.
కాగా ఇదే విషయాన్ని కియారా అద్వానీ కూడా ఒప్పుకుంది.తాజాగా ఆమె కరణ్ జోహార్ టాక్ షో కాఫీ విత్ కరణ్ షోలో మాట్లాడుతూ…మొదట ఆ పాత్రను బాలీవుడ్ లో అప్పటికే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న కృతి సనన్ వద్దకు వెళ్లింది.అప్పుడు కృతి తల్లి అలాంటి పాత్రల పట్ల వ్యతిరేకించడంతో కృతి కూడా వద్దనుకుంది.
అయితే కృతి సనన్ ఆ పాత్రను వద్దు అనడంతో కరణ్ జోహార్ ఆ సన్నివేశం ను పాత్ర తీరును చెప్పగానే కియారా ఓకే చెప్పిందట.ఒక వెబ్ సిరీస్ లో అలాంటి పాత్రను చేయడం అంటే చాలా పెద్ద సాహసం.
నిజంగా అలాంటి పాత్రను చేసినందుకు గాను కియారా అద్వానీ లక్కీ అని చెప్పుకోవచ్చు.ఆ పాత్ర వల్లే ప్రస్తుతం ఆమె కెరీర్ ఈ స్థాయిలో ఉంది.