డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే కలిసి నటించిన తాజా చిత్రం లైగర్.ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది.
కాగా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లో కూడా భారీ స్థాయిలో హైట్ క్రియేట్ చేసుకుంటోంది ఈ సినిమా.
కాగా లైగర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రేక్షకుల నుంచి భారీగా రెస్పాన్స్ వస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి బాగానే స్పందన వచ్చింది.
కాకుండా ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ లెక్కలు కూడా అప్పుడే బయటకు వచ్చేసాయి.విజయ్ దేవరకొండకు పూరీ జగన్నాథ్ కు ఈ సినిమా చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు.ఎందుకంటే ఈ సినిమా కోసం వీరిద్దరూ చాలా హార్డ్ వర్క్ చేశారు.2019లో మొదలైన ఈ సినిమా ఎన్నో అవాంతరాలను ఎదుర్కొనీ మొత్తానికి ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.విజయ్,పూరి కెరీర్ లోనే ఈ సినిమా అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతోంది.ఇకపోతే నైజాం ఏరియాలో రౌడీ హీరోకి ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో మనందరికీ తెలిసిందే.
ప్రతి ఒక సినిమాకు కూడా నైజాం లో అత్యధిక కలెక్షన్స్ అందుకుంటూ ఉంటుంది.ఇప్పుడు ఆ ఏరియాలో ఏకంగా 25 కోట్ల బిజినెస్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.ఇక సీడెడ్ లో అయితే విజయ్ దేవరకొండ సినిమా మొదటిసారి 9 కోట్ల ధర పలకగా ఇక ఆంధ్ర మొత్తంలో చూసుకుంటే 28 కోట్ల వరకు ప్రీతి బిజినెస్ చేయక మొత్తంగా ఏపీ తెలంగాణలో లైగర్ సినిమా 62 కోట్ల బిజినెస్ చేసింది.