మేడ్చ‌ల్ క‌లెక్ట‌రేట్ ప్రారంభించిన సీఎం కేసీఆర్

మేడ్చ‌ల్ జిల్లాలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌టించారు.దీనిలో భాగంగా జిల్లా క‌లెక్ట‌రేట్ ను ఆయ‌న ప్రారంభించారు.నూతన కలెక్టరేట్‌ భవన సముదాయాల కార్యాలయాన్ని అంతాయిపల్లిలో 30 ఎకరాల స్థలంలో రూ.56.20 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు.భవనంలో 55 గదులతో పాటు కలెక్టర్, ఇద్దరు అదనపు కలెక్టర్లు, డీఆర్వో , ఏవో, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులకు ప్రత్యేక గదులు నిర్మించారు.

 Inauguration Of Medchal Collectorate By Cm Kcr Details, Cm Kcr, Medchal Collecto-TeluguStop.com

అదేవిధంగా జిల్లా మంత్రికి ప్రత్యేక ఛాంబర్‌, 250 మంది కూర్చునేలా సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేశారు.

ఇక‌పై, జిల్లా నూతన కలెక్టరేట్‌ ప్రారంభంతో పరిపాలన అంతా ఒకే చోట నుంచి కొనసాగనుంది.

కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి 2016 అక్టోబర్‌ 11న మేడ్చల్‌–మల్కాజిగిరి , వికారాబాద్‌ జిల్లాలు ఏర్పాటైన సంగ‌తి తెలిసిందే.ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube