ఈ రకమైన పెళ్ళికి ఎపుడైనా వెళ్ళారా? అహ వెళ్ళుండరులే!

నేడు ప్రపంచమే ఓ కుగ్రామం అయిపోయింది.అదేనండి స్మార్ట్ ఫోన్ రూపంలో ప్రపంచమే అరచేతిలోకి వచ్చేసింది.

 Ever Been To This Type Of Wedding Marriage, Viral Latest, Viral News, Social Vi-TeluguStop.com

దాంతో ప్రపంచం నలుమూలలా జరుగుతున్న వింతలూ, విశేషాలు మనకు యిట్టె తెలిసిపోతున్నాయి.సాధారణంగా వధూవరులు లేకుండా పెళ్లి అనేది జరగడం అసాధ్యం కదా.అయితే అక్కడ పెళ్ళిలో దాన్ని సుసాధ్యం చేసారు.పెళ్ళికి ఎవరు వచ్చినా రాకున్నా వధూవరులైతే పెళ్లి పీటలెక్కుతారు.

కానీ తన పెళ్లికి పెళ్లికొడుకే హాజరుకాకపోతే ఎట్లా? మనదగ్గరైతే నానా రాద్ధాంతం జరిగేదే కదా.కానీ అక్కడ కధ సుఖాంతం అయింది! వివరాల్లోకి వెళితే, పశ్చిమ ఆఫ్రికా దేశమైన సియారా లియోన్‌లో ఇటీవల ఓ విచిత్రం చోటుచేసుకుంది.చైనా ఫుట్‌బాల్‌ లీగ్‌ నుంచి స్వీడన్‌కు చెందిన మాల్మో ఎఫ్‌సీ అనే పుట్‌బాల్‌ క్లబ్‌లో ఇటీవల చేరిన మొహమ్మద్‌ బుయా టురే అనే 26 ఏళ్ల ఫుట్‌బాలర్‌ తన ప్రేయసితో పెళ్లికి రంగం సిద్ధం చేసుకున్నాడు.

అయితే పెళ్లి రోజునే తొలి మ్యాచ్‌ ఆడేందుకు వీలుగా ప్రాక్టీస్‌ సెషన్‌లో తప్పనిసరిగా పాల్గొనాలంటూ చివరి నిమిషంలో క్లబ్‌ నిర్వాహకుల నుంచి అతనికి పిలుపు వచ్చింది.

దాంతో అతడు ఇక చేసేదేమీ లేకపోవడంతో తన సోదరుడిని వరుడి స్థానంలో కూర్చోబెట్టి స్వీడెన్‌ చెక్కేసాడు! ఆ తరువాత పెళ్లి దుస్తులు ధరించడం దగ్గర్నుంచి వధువుతో కలిసి కేక్‌ కటింగ్‌ చేయడం వరకు తన సోదరుడే పెళ్లి తంతునంతా కానిచ్చాడు.పెళ్లి ఫొటోలు, వీడియోల్లో దర్జాగా భార్యకాని భార్యతో కలసి పోజులిచ్చాడు!! ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు పలు విమర్శలు చేసారు.

దాంతో ఒరిజినల్ వరుడు టురే స్పందించాడు.పెళ్లికి ముందు రోజే తామిద్దరం పెళ్లి దుస్తుల్లో ఫొటోలు, వీడియోలు దిగామంటూ వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశాడు.అయితే మ్యాచ్‌ల కారణంగా ఇంతవరకు తన ‘భార్య’ను కలుసుకోవడం వీలుకాలేదని.త్వరలోనే ఆమెను స్వీడన్‌ రప్పించేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube