భూమికి స‌మీపంగా దూసుకొస్తున్న గ్ర‌హ శ‌క‌లాలు

భూ గ్ర‌హంపై ఎన్నో ఉత్పాతాల‌కూ గ్ర‌హ శ‌కలాలు కార‌ణం అయ్యాయి.కొన్ని సంవ‌త్స‌రాల క్రితం 90 శాతం జీవాన్ని తుడిచి పెట్టేంది ఓ ఆస్ట‌రాయిడ్.

 Planetary Fragments Crashing Close To Earth , Asteroid,earth, Planetary Fragment-TeluguStop.com

అంత‌రిక్షంలో ఉండే ఆస్ట‌రాయిడ్లు అప్పుడ‌ప్పుడూ భూమికి అత్యంత సమీపంగా దూసుకెళ్తుంటాయి.ఈ క్ర‌మంలోనే తాజాగా ఐదు రోజుల వ్య‌వ‌ధిలో ఏకంగా నాలుగు గ్ర‌హ శ‌క‌లాలు భూమి స‌మీపం నుంచి దూసుకెళ్ల‌నున్న‌ట్లు నాసా శాస్త్ర‌వేత్త‌లు ప్ర‌కటించారు.

నార్మ‌ల్ గా చిన్న శ‌క‌లాలు అయితే భూ వాతావ‌ర‌ణంలోకి ప్ర‌వేశించినా మ‌ధ్య‌లోనే మండిపోతాయి.పెద్ద గ్ర‌హ శ‌క‌లాలు పూర్తిగా మండిపోక ముందే దిగువ‌దాకా దూసుకొచ్చి భూమిని ఢీకొన్న‌ప్పుడు భారీ న‌ష్టాన్ని క‌లిగిస్తుంటాయి.

‘2015 ఎఫ్ఎఫ్’గా పిలిచే ఆస్టరాయిడ్ ఆగ‌స్ట్ 12న‌ భూమికి సమీపంగా వెళ్లనుంది.53 అడుగుల ఉన్న ఈ ఆస్టరాయిడ్ తో పెద్దగా ప్రమాదం లేదని నాసా తెలిపింది.భారత కాలమానం ప్రకారం ఆగస్టు 14న తెల్లవారుజామున 3.23 గంటల సమయంలో ‘2022 ఓటీ1’గా పిలిచే ఆస్టరాయిడ్ భూమికి సమీపంగా వెళ్లనుంది.110 అడుగుల పరిమాణమున్న ఈ గ్రహ శకలం భూమికి 47 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ఏకంగా గంటకు 20,520 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుందని నాసా తెలిపింది.ఆగస్టు 14న మధ్యాహ్నం 71 అడుగుల పరిమాణం ఉన్న ‘2022 ఓఏ4’ ఆస్టరాయిడ్ భూమికి సమీపంగా దూసుకుపోనుందని నాసా వెల్ల‌డించింది.

ఆగస్టు 16న 93 అడుగుల వెడల్పున్న ‘2022 పీడబ్ల్యూ’ ఆస్టరాయిడ్ భూమికి పక్కగా ప్రయాణించనుందని నాసా ప్ర‌క‌టించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube