కాల్ షీట్లకి.. షీట్లకు తెలియని వాళ్లు నిర్మాతలు.. మరోసారి రెచ్చిపోయిన బండ్లన్న?

సినిమా ఇండస్ట్రీలో సంచలనాలకు, విభేదాలకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి బండ్ల గణేష్ ఎప్పుడు ఎవరిని ఉద్దేశించి ఎలాంటి కామెంట్స్ చేస్తారో తెలియదు.అయితే ఈయన చేసిన కామెంట్స్ మాత్రం తీవ్రస్థాయిలో వివాదానికి కారణం అవుతాయి.

 Call Sheets Those Who Don't Know The Sheets Are The Producers, Tollywood, Bandla-TeluguStop.com

గత కొద్ది రోజుల నుంచి బండ్ల గణేష్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పలు వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.ఈ క్రమంలోనే చోర్ బజార్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా పూరి జగన్నాథ్ గురించి షాపింగ్ కామెంట్స్ చేసిన బండ్ల గణేష్ లైగర్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా విజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ తనదైన శైలిలో కామెంట్లు చేశారు.

ఇదిలా ఉండగా తాజాగా ప్రొడ్యూసర్ గిల్డ్ సమావేశంలో భాగంగా సినిమా షూటింగ్ ల గురించి నిర్ణయం తీసుకొని ఆగస్టు ఒకటవ తేదీ నుంచి సినిమా షూటింగులను బంద్ చేయాలని పేర్కొన్న విషయం మనకు తెలిసిందే అయితే బండ్ల గణేష్ తాజాగా ఈ వ్యవహారంపై స్పందించారు.ప్రొడ్యూసర్స్ గిల్డ్ వ్యవస్థ ఒక నిరుపయోగమైన వ్యవస్థ సినిమాలు చేయడం రాని వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Telugu Bandla Ganesh, Liger, Pawan Kalyan, Tollywood-Movie

సినిమా ఇండస్ట్రీలో ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ ఉన్నాయి.ప్రతి ఒక్కరు వీటికి కట్టుబడి ఉండాలి కానీ ఎవరికి హీరోలు రెమ్యూనరేషన్ పెంచుకోవాలి తగ్గించుకోవాలని చెప్పే హక్కు లేదని ఈయన తెలిపారు.వారి మార్కెట్ బట్టి వారికి రెమ్యూనరేషన్ ఇస్తుంటారు.అంతేకానీ రెమ్యూనరేషన్ తగ్గించుకోమని చెప్పే అధికారం ఎవరికి లేదని బండ్ల గణేష్ తెలిపారు.ఇకపోతే ఇండస్ట్రీలో కాల్ షీట్లకు,షీట్లకు తేడా తెలియని వారు కూడా నిర్మాతలుగా ఉండి సినిమాలు చేస్తున్నారని,షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో ఎప్పుడు పూర్తవుతుందో తెలియని వాళ్లు కూడా నిర్మాతలుగా సినిమాలు చేస్తున్నారంటూ బండ్ల గణేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube