ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్షాలు తమ అభ్యర్థిని ప్రకటించాయి.తమ ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి మార్గరెట్ అల్వాను బరిలోకి దించుతున్నట్టు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ ప్రకటించారు.
అధికార కూటమి ఎన్డీయే తమ అభ్యర్థిని ప్రకటించిన మరుసటి రోజే ప్రతిపక్షాల అభ్యర్థిని రంగంలోకి దించడం గమనార్హం.మార్గరెట్ అల్వాను అభ్యర్థిగా 17 పార్టీలు ఏకగ్రీవంగా నిర్ణయించాయని పవార్ తెలిపారు.
అయితే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరేట్ అల్వా ఎంపిక చేయడంతో ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు.తనను ఎంపిక చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నానని.వినయంతో అంగీకరిస్తున్నానని పేర్కొన్నారు.తనపట్ల విశ్వాసం ఉంచిన ప్రతిపక్షాల నేతలందరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్టు ఆమె ట్వీట్ చేశారు.
మార్గరెట్ అల్వా మంగళవారం నామినేషన్ వేస్తారని పవార్ తెలిపారు.
కాంగ్రెస్ సీనియర్ నేత మార్గరెట్ అల్వా కర్నాటకకు చెందినవారు.
మార్గరెట్ అల్వా ఐదు సార్లు ఎంపీగా పనిచేశారు.గతంలో నాలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరించారు.
గోవా, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఆమె గవర్నర్‌గా సేవలందించారు.అంతకుముందు ఆమె కేంద్రమంత్రిగానూ పనిచేశారు.

మరోవైపు ఎన్డీయే తమ అభ్యర్థిగా పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కడ్‌ను బరిలోకి దించిన విషయం తెలిసిందే.ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీ కాలం ఆగస్టు 10తో ముగియనున్న నేపథ్యంలో కొత్త ఉపరాష్ట్రపతి నియామకం కోసం ఆగస్టు 6న ఎన్నికలు జరగనున్నాయి…నామినేషన్లు సమర్పించేందుకు ఈ నెల 19 వరకూ గడువు ఉన్నది.ఇవాళ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్ ఖడ్ నామినేసన్ వేయనున్నారు.ప్రతిపక్షాల అభ్యర్థి మార్గరేట్ అల్వా రేపు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు శరత్ పవార్ వెల్లడించారు.
నాలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసిన మార్గరెట్ అల్వాను బరిలోకి దించుతున్నట్టు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ ప్రకటించారు.మార్గరెట్ అల్వాను అభ్యర్థిగా 17 పార్టీలు ఏకగ్రీవంగా నిర్ణయించాయని తెలిపారు.