జ్యోతిష్యంను చాలామంది నమ్ముతారు.ప్రపంచవ్యాప్తంగా జ్యోతిష్యంను ఎక్కువమంది నమ్ముతున్నారు.
వీధికోక జ్యోతిష్యుడు పుట్టుకొచ్చాడు.టెక్నాలజీ వల్ల ఆన్ లైన్ లోకి కూడా జ్యోతిష్యం వచ్చింది.
ఆన్ లైన్ లో బోలెడన్నీ వెబ్ సైట్లు పుట్టుకొచ్చాయి.డబ్బులు కడితే ఆన్ లైన్ లో జ్యోతిష్యం చెప్పే జ్యోతిషులు ఉన్నారు.
అయితే జ్యోతిష్యం అనేక విధాలుగా చెబుతూ ఉంటారు.చిలుక జ్యోతిష్యం, చేతిలోని రేఖలను చూపించి చెప్పే లాంటివి అనేకం ఉన్నాయి.
అయితే ఉల్లికాడలతో కూడా జ్యోతిష్యం చెబుతున్నారు.మిస్టిక్ వెజ్ అనే ఒకామె ఉల్లికాడలతో జ్యోతిష్యం చెబుతూ పాపులర్ అయింది.రిషి సునన్ అనే ఈమె భారతీయ మూలాలున్న వ్యక్తి.యూకేలో మిస్టివ్ వేజ్ గా పేరున్న ఆ జ్యోతిష్యురాలు ఉల్లికాడలతో జ్యోతిష్యం చెబుతూ ఉంటుంది.
గతంలో ఆమె చెప్పిన జ్యోతిష్యాలు అనేకం నిజమయ్యాయి.దీంతో ఆమె చెప్పే జ్యోతిష్యాన్ని అందరూ నమ్ముతున్నారు.
ఆమె చెప్పే జోస్యాల కోసం అందరూ ఆసక్తిగా చూస్తు ఉంటారు.
తాజాగా బ్రిటన్ తర్వాతి ప్రధాని ఎవరనే దానిపై ఈమె జోస్యం చెప్పింది.
బోరిస్ జాన్సన్ రాజీనామాతో బ్రిటన్ తర్వాతి ప్రధాని ఎవరనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది.
రేసులో అనేక పేర్లు వినిపిస్తున్నాయి.బెన్ వాలేస్ యూకేకు కాబోయే ప్రధాని అంటూ ప్రకటించి సంచలనం రేపింది.ఉల్లికాడలను పాచికల్లా వేసి ఆమె జోస్యం చెబుతూ ఉంటుంది.
ఇప్పుడు కూడా అలాగే చెప్పింది.గతంలో యూకే బోరిస్ జాన్సన్ ప్రధాని అవుతాడని, ప్రిన్స్ ఫిలిప్ చనిపోతాడని.
ఇలా ఆమె చెప్పిన అనేక జోస్యాలు నిజమయ్యాయి.దీంతో ఈ సారి కూడా ఆమె జోస్యం నిజమవుతుందని అంటున్నారు.
ప్రస్తుతం బోన్ వాలేస్ రక్షణమంత్రిగా ఉన్నారు.దీంతో ఆయనకు ప్రధాని అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు.