యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.జూనియర్ ఎన్టీఆర్ గడిచిన ఎనిమిది సంవత్సరాలుగా వరుస విజయాలను సొంతం చేసుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
ఈతరం ప్రేక్షకులు ఇష్టపడే కథలను ఎంచుకుంటున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాల ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువవుతున్నారు.ఓవర్సీస్ లో కూడా తారక్ సినిమాలకు భారీగా కలెక్షన్లు వచ్చాయి.
అటు క్లాస్ ఇటు మాస్ ప్రేక్షకులను మెప్పించే కథలలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుండటంతో ఓవర్సీస్ ప్రేక్షకులను కూడా మన సినిమాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.జూనియర్ ఎన్టీఆర్ నటించిన 7 సినిమాలు యూఎస్ లో 1 మిలియన్ మార్కును దాటాయి.
అయితే న్యాచురల్ స్టార్ నాని అంటే సుందరానికి సినిమాతో ఈ రికార్డును సమం చేయడం గమనార్హం.మహేష్ బాబు నటించిన 11 సినిమాలు ఓవర్సీస్ లో 1 మిలియన్ మార్కును అందుకున్నాయి.
పవన్ నటించిన 6 సినిమాలు, అల్లు అర్జున్ నటించిన 5 సినిమాలు ఓవర్సీస్ లో 1 మిలియన్ మార్కును అందుకోవడం గమనార్హం.అంటే సుందరానికి సినిమా ఓవర్సీస్ లో భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించినా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం కష్టమేననే సంగతి తెలిసిందే.
ఇప్పటివరకు ఈ సినిమాకు 18 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి.తెలుగు రాష్ట్రాల్లో అంటే సుందరానికి కలెక్షన్లు ఊహించని స్థాయిలో డ్రాప్ కావడం గమనార్హం.
అయితే అంటే సుందరానికి సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లను అందుకోలేకపోయినా దసరా సినిమాతో నాని సక్సెస్ ట్రాక్ లోకి వస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.దసరా సినిమా 60 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.దసరా సినిమాతో నాని కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.