బన్నీ వాసు మొదట డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత నాగచైతన్య, తమన్నా నటించిన హండ్రెడ్ పర్సెంట్ లవ్ సినిమా తో నిర్మాతగా మారాడు.ఈ సినిమా తర్వాత ఆ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను చేశారు.
ఇకపోతే ప్రస్తుతం బన్నీ వాసు పక్కా కమర్షియల్ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.తాజాగా ఆయన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ముచ్చటించారు.
ఈ నేపథ్యంలోనే ఇంటర్వ్యూలో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఇంటర్వ్యూ లో భాగంగా బన్నీవాసు మాట్లాడుతూ.
మనం ఎంత సంపాదించాం అన్నది కాకుండా ఆడియన్స్ కు, థియేటర్ కు ఎంత దగ్గరగా ఉంచడం అనేది ఇంపార్టెంట్.అందుకే ఈ పక్కా కమర్షియల్ సినిమాని కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా.
మధ్యతరగతి ప్రజలు సినిమాకు వచ్చే ఈ విధంగా అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేశాము అని తెలిపారు బన్నీవాసు.అలాగే తాను 2002లో ఇండస్ట్రీ కి వచ్చానని, నిర్మాతగా 2011లో నా మొదటి సినిమా నేను చేశాను అని చెప్పుకొచ్చారు బన్నీవాసు.
ఈ పదేళ్ల కాలంలో ఎన్నో మార్పులు వచ్చాయి అని చెప్పుకొచ్చారు బన్నీవాసు.ఇకపోతే ఈ మధ్యకాలంలో సినిమా థియేటర్ లలో బాగా ఆడాలి అన్నా సూపర్ హిట్ గా నిలబడాలి అన్న ఎక్స్ట్రార్డినరీ కంటెంట్ వుండాలని, సాధారణ ఆర్డినరీ కంటెంట్ తో సినిమా చేయలేము అని చెప్పుకొచ్చారు బన్నీవాసు.ఇకపోతే బన్నీవాసు తాజాగా నిర్మించిన పక్కా కమర్షియల్ సినిమా విడుదలకు సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే.ఈ సినిమా తరువాత చందు మొండేటి పవన్ సాదినేని సినిమాలు ఉండబోతున్నాయి అని వెల్లడించారు.