నయనతారను కోడలిగా చేసుకోవడానికి విఘ్నేష్ తల్లి పెట్టిన కండీషన్ ఇదే?

స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం సౌత్ ఇండియాలో ఎక్కువ మొత్తంలో పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా ఉన్నారు.నయనతార 4 కోట్ల రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నా ఆమెకు ఆ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.

 Vignesh Shivan Mother Shocking Condition For Naynatara Details Here , Vignesh S-TeluguStop.com

నయనతారను హీరోయిన్ గా ఎంపిక చేయడం వల్ల ఇతర ఏరియాలలో కూడా ఆమె నటించిన సినిమాలకు భారీస్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

ఈ నెల 9వ తేదీన మహాబలిపురంలో నయనతార విఘ్నేష్ ల వివాహం జరగనుందనే సంగతి తెలిసిందే.

నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో నయనతార పెళ్లి స్ట్రీమింగ్ కానుండగా పెళ్లిని కూడా నయనతార విఘ్నేష్ శివన్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడంపై నెటిజన్ల నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.నయనతార ప్రతి విషయంలో మనీ మైండ్ తో ఆలోచిస్తున్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

అయితే నయనతారను కోడలిగా చేసుకోవడానికి విఘ్నేష్ శివన్ తల్లి మీనా కుమారి ఒక షరతును విధించారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం.పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉండాలని సినిమాలలో నటించినా మంచి పాత్రల్లోనే నటించాలని ఆమె సూచించారని సమాచారం.

నయనతార కూడా ఆ కండీషన్ కు ఓకే చెప్పారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

Telugu Mother, Nayanatara, Vigneshshivan-Movie

అయితే నయనతార లేదా విఘ్నేష్ శివన్ వైరల్ అవుతున్న ఈ ప్రచారానికి సంబంధించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.చేతినిండా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలోనే నయనతార పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.పెళ్లి తర్వాత నయనతార కెరీర్ విషయంలో ఏ విధంగా ముందడుగులు వేస్తారో చూడాల్సి ఉంది.

నయనతార నటించిన కన్మణి రాంబో ఖతీజా ఏప్రిల్ లో విడుదలై ఫ్లాప్ గా నిలిచింది.నయనతార తర్వాత సినిమాలతో సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube