పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం .. కాన్సులేట్ ఏర్పాటు చేయండి: ఆస్ట్రేలియా ప్రభుత్వానికి కేటీఆర్ విజ్ఞప్తి

ఇటీవలే లండన్, దావోస్‌లలో పర్యటించి తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టబడులు రప్పించారు మంత్రి కేటీఆర్.ఈ క్రమంలో మరిన్ని దేశాల నుంచి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు.

 Telangana Minister Ktr Urges Australia To Have More Tie-ups With State , London,-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు చెందిన ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణలో పరిస్ధితులు అనుకూలంగా వున్నాయని మంత్రి తెలిపారు.ఇండియా ఎకనామిక్‌ స్ట్రాటజీ-2035 అంశంపై ఆస్ట్రేలియా కాన్సులేట్‌ సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌, చెన్నైలోని ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్‌ సారా కిర్లే పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ప్రసంగిస్తూ….తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆస్ట్రేలియా వ్యాపారవేత్తలు ముందుకు రావాలని కోరారు.పరిశ్రమలను ప్రోత్సహించేందుకు 2014లో విడుదల చేసిన పారిశ్రామిక విధానంతో రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లలో 19 వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని కేటీఆర్ గుర్తుచేశారు.ఇప్పటి వరకు 35 బిలియన్‌ డాలర్ల విలువైన పెట్టుబడులు వచ్చాయని, 16 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించిందని మంత్రి తెలిపారు.

క్రికెట్‌తో పాటు అనేక అంశాల్లో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య బలమైన బంధం ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Telugu Australia, Davos, India, London, Ktr, Telanganaktr, Ts Ipass-Telugu NRI

తెలంగాణ, ఆస్ట్రేలియా మధ్య విద్య, వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెరుగుతున్నందున ఆస్ట్రేలియా కాన్సుల్‌ జనరల్‌ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని ఆయన సారా కిర్లేను కోరారు.లైఫ్‌ సైన్సెస్‌తో పాటు ఫుడ్‌ ప్రాసెసింగ్‌, టెక్స్‌టైల్‌ సహా 14 రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులకు విశేష అవకాశాలున్నాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.దక్షిణ భారత దేశంలోనే హైదరాబాద్‌ బెస్ట్‌ సిటీ అని, భారత్‌లో మరే నగరంలోనూ లేని పెట్టుబడుల అనుకూల వాతావరణం ఇక్కడ ఉందని ఆయన తెలిపారు.

క్వాలిటీ ఆఫ్‌ లివింగ్‌లో అన్ని నగరాల కంటే హైదరాబాద్‌ దూసుకుపోతోందని కేటీఆర్ చెప్పారు.టీఎస్‌ఐపాస్‌ ద్వారా 15 రోజుల్లో అన్ని అనుమతులు వస్తాయని, ఇందులో వ్యక్తుల ప్రమేయం ఉండదని ఆయన పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube