సుమ లేక‌పోతే 'జయమ్మ పంచాయితీ సాధ్య‌మ‌య్యేది కాదు- ద‌ర్శ‌కుడు విజయ్ కుమార్ కలివరపు

పాపులర్ యాంకర్, టెలివిజన్ వ్యాఖ్యాత, హోస్ట్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ పంచాయితీ’ విడుదలకు సిద్ధమైయింది.వెన్నెల క్రియేషన్స్‌ పతాకం పై బలగ ప్రకాష్‌ నిర్మించిన‌ ‘జయమ్మ పంచాయితీ’ మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైయింది.

 Jayamma Panchayat Is Not Possible Without Suma , Director Vijay Kumar Kalivarapu-TeluguStop.com

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు విజయ్ కుమార్ కలివరపుతో ముఖాముఖి.నేను శ్రీకాకుళం సమీపంలోని గ్రామం నుండి వచ్చాను.

పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాక సినిమాపై ఇంట్రెస్ట్‌ తో షార్ట్ ఫిల్మ్స్ చేశాను.స్టార్ హీరోలతో పనిచేయాలని కొన్నాళ్లుగా అనుకుంటున్నాను.

స్టార్ హీరోతో సినిమా తీయడం అంత ఈజీ కాదనే విషయం అర్థమయ్యేసరికి నాకు టైం పట్టింది.అప్పుడే 60 నుంచి 70 లక్షల బడ్జెట్‌తో సినిమా తీయడానికి కొంతమంది మిత్రులతో కలిసి పనిచేశాను.

‘జయమ్మ పంచాయితీ’ ఒక పొటెన్షియల్ స్క్రిప్ట్‌ గా వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు.అంతలా టాప్ టీవీ యాంకర్ సుమ కూడా అందులో చేరింది.

ఎంఎం కీరవాణి లాంటి సంగీత దర్శకుడు స్వరాలు సమకూర్చారు.సినిమాను ఫ్లోర్స్ కి తీసుకెళ్లడానికి ముందు ఒక నెల పాటు నటీనటులతో వర్క్‌షాప్ చేశాం.

గత కొన్ని వారాలుగా పవన్ కళ్యాణ్, రాజమౌళి, త్రివిక్రమ్ వంటి వారు మా సినిమాకు ప్ర‌మోష‌న్ ఇవ్వ‌డం నేను ఊహించ‌లేనిది.అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను.

క‌థ ప్ర‌కారం న‌టీనటుల ఎంపికను క‌రెక్ట్‌గా చేయాలి.లేదంటే సినిమా ఎవరికీ తెలియకుండా పోతుంది.

జయమ్మ పాత్రలో రమ్యకృష్ణ వంటి నటి అయితే బాగుంటుంది అనుకున్నా.అయితే వారిని ఇప్పటికే భిన్నమైన పాత్రల్లో చూశాం.

సుమ పేరు ఎవరో సజెస్ట్ చేయడంతో ఆమె దగ్గరకు వెళ్లాను.కథాంశం ఆమెకు నచ్చింది.

ఆమె ఆసక్తి చూపిన తర్వాత కూడా నాకు ఆమె న‌ట‌న‌పై సందేహం క‌లిగింది.అందుకే టెస్ట్ షూట్ చేశాం.

అది చాలా నమ్మకం కలిగించింది ,

సుమ చాలా ప్రతిభావంతురాలు.ఆమె ‘బ్రేకింగ్ బాడ్’ వంటి వెబ్ షోలలో నటుల ప్రదర్శనలలోని చిన్న చిన్న అంశాల‌నుకూడా గమనిస్తుంది.

అప్పుడే సుమ‌పై నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది.స్క్రిప్ట్ చదివిన తర్వాత ఆమె నా షార్ట్ ఫిల్మ్స్ చూసింది.

కీరవాణి బాణీలు చేయ‌డంతో నాపై నాకు మ‌రింత పెరిగింది’జయమ్మ పంచాయతీ క‌థ నిజమైన వ్యక్తుల నుండి ప్రేరణ పొందింది.నా జీవితంలో నేను కలిసిన వ్యక్తులను నేను నాటకీయంగా చూపించాను.

ఇది కల్పిత కథ అయినప్పటికీ కొన్ని సన్నివేశాలు వాస్తవ సంఘటనల నుండి ప్రేరణ పొందా.కథ ఆధారంగానే టైటిల్‌ పుట్టింది.

పూర్తిగా చెప్పాలంటే, సతీ సావిత్రి, యముడి పురాణం మనందరికీ తెలుసు.జయమ్మ కూడా త‌న స‌మ‌స్య‌ల‌పై పోరాడిన క‌థ‌.

జ‌య‌మ్మ ఒకప్పుడు సంపన్న కుటుంబం నుంచి వచ్చింది.ఆమె గ్రామంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది.

ఆమె చేసే పోరాటం పెద్ద వివాదంగా మారుతుంది.జయమ్మ అమాయకురాలు.

ఆమె పోరాటంలో బలమైన అంశం ఒక‌టి దాగివుంది.అది ఏమిటినేది సినిమా చూస్తేనే తెలుస్తుంది.

ఈ సినిమాకు దొరికిన ఆర్టిస్టులు గ‌మ‌నిస్తే వారంతా దొర‌క‌పోతే ‘జయమ్మ పంచాయతీ తీసేవాడిని కాదేమో అని అనిపించేది.మిగిలిన‌వారు మా ఊరిలోని వారు న‌టించారు.చాలా స‌హ‌జంగా న‌టించ‌డం వివేషం.శ్రీ‌కాకుళం మాండ‌లికాన్ని సుమ చాలా త్వరగా నేర్చుకునేది.మలయాళీ అయినప్పటికీ ఇక్కడ టాప్ యాంకర్‌గా ఎదిగింది.ఆమె స‌హ‌కారంతో సింక్ సౌండ్‌లోనే ఈ చిత్రాన్ని చిత్రీకరించాం.సినిమాలో నాలుగు పాటలుంటే ఒక్కొక్కటి కథను ముందుకు తీసుకెళ్తాయి.నేను 6 ఏళ్లు షార్ట్ ఫిల్మ్స్ చేశాను.

వాటిలో కొన్ని అవార్డులు గెలుచుకున్నాయి.అందులో ‘ఐస్ ఆఫ్ హంగర్’ ఒకటి.

అందులో వున్న తప్పులు త‌ర్వాత చేయ‌కూడ‌ద‌ని నేర్చుకున్నాను.షార్ట్ ఫిల్మ్ కూ ఫీచర్ ఫిల్మ్ కూ మధ్య తేడా చెప్పాలంటే, ఎమోషనల్ కంటెంట్ దాదాపు సాధారణం.స్క్రీన్ ఒక‌టే మార్పు.‘కేర్ ఆఫ్ కంచరపాలెం’ ఫేమ్ వెంకటేష్ మహా, ‘డియర్ కామ్రేడ్’ ఫేమ్ భరత్ కమ్మ వంటి వారితో నాకు స్నేహం ఉంది.అందుకే నాకు సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం క‌ష్టంగా అనిపించ‌లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube