వాళ్లు మాత్రమే పాన్ ఇండియా హీరోలంటూ రవీనా షాకింగ్ కామెంట్స్.. ఎన్టీఆర్, బన్నీకి షాకిస్తూ?

కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమా సక్సెస్ తో రవీనా టాండన్ పేరు వార్తల్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే.సినిమాలో రవీనా అద్భుతంగా నటించిందని కామెంట్లు వినిపిస్తూ ఉండటంతో పాటు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

 Raveena Tandon Shocking Comments About Pan India Heroes Details Here , Pan Indi-TeluguStop.com

రమీకా సేన్ పాత్రలో ప్రధానమంత్రిగా కనిపించి రవీనా టాండన్ ఆ పాత్రకు ప్రాణం పోశారు.రవీనా టాండన్ నటనను చూసి సౌత్ ప్రేక్షకులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.

అయితే కేజీఎఫ్2 ప్రమోషన్స్ లో భాగంగా రవీనా టాండన్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే డిఫరెన్స్ లేదని అంతా ఇండియన్ మూవీ అని ఆమె వెల్లడించారు.

ప్రభాస్, చరణ్, యశ్ పేర్లు పాన్ ఇండియా మార్కెట్ లో వినిపిస్తాయని ఆమె కామెంట్లు చేశారు.అయితే బన్నీ, ఎన్టీఆర్ పేర్లను రవీనా ప్రస్తావించకపోవడం గురించి కొందరు నెటిజన్లు ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు.

Telugu Bollywood, Bunny, Charan, Hollywood, Kgf Chapter, Prabhas, Ramika Sen, Ra

రవీనా టాండన్ కావాలనే వాళ్ల పేర్లు మరిచిపోయిందో లేక ఉద్దేశపూర్వకంగా వాళ్ల పేర్లను ప్రస్తావించలేదో క్లారిటీ అయితే లేదు.బన్నీ, ఎన్టీఆర్ లకు కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది.తమ టాలెంట్ తో ఈ ఇద్దరు హీరోలు సత్తా చాటుతున్నారు.అయితే బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం ఈ హీరోలను పట్టించుకోకుండా ఉండటం గమనార్హం.రవీనా భవిష్యత్తులో ఈ కామెంట్ల గురించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Telugu Bollywood, Bunny, Charan, Hollywood, Kgf Chapter, Prabhas, Ramika Sen, Ra

బన్నీ, ఎన్టీఆర్ ఇండస్ట్రీలో తమ ప్రతిభతో ఎదిగారనే సంగతి తెలిసిందే. యావరేజ్ కథలను సైతం తమ నటనతో బ్లాక్ బస్టర్ హిట్లు చేయగల ప్రతిభ ఈ హీరోల సొంతమని చెప్పవచ్చు.ఈ హీరోలు భవిష్యత్తులో కూడా అంచనాలను మించిన విజయాలను అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

బన్నీ పుష్ప ది రూల్ తో బిజీగా ఉండగా ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube