అతి తక్కువ సమయంలో 100% ఛార్జ్ అయ్యే ఫోన్లు ఇవే..!

స్మార్ట్‌ఫోన్ టెక్నాల‌జీ నిత్యం అప్‌గ్రేడ్ అవుతూనే ఉంటుంది.అందుకే ఎప్పటికప్పుడు మనల్ని అబ్బురపరిచే టెక్నాలజీతో స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి.

 Ones That Charge 100% In The Shortest Time 100 Percent, Charges, Mobile Phones-TeluguStop.com

ఈ స్మార్ట్‌ఫోన్లు మోస్ట్ పవర్‌ఫుల్ బ్యాటరీలతో యూజర్లను ఆకట్టుకుంటున్నాయి.ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫోన్స్ లో అతి తక్కువ సమయంలో 100% ఛార్జ్ అయ్యే ఫోన్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐకూ 9 5జీ

ఐకూ 9 5జీ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్ డ్రాగన్ 888+ ప్రాసెసర్ ఉంటుంది.ఇది 120W ఫ్లాష్ ఛార్జింగ్‌ సపోర్టుతో 6 నిమిషాల్లో 50%, జస్ట్ 18 నిమిషాల్లో 100% ఛార్జ్ అవ్వడం విశేషం.

షియోమీ 11టీ ప్రో

Telugu Latest, Ups-Latest News - Telugu

షియోమీ 11టీ ప్రో స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ సాయంతో రన్ అవుతుంది.6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ, 120 వాట్ హైపర్‌ఛార్జ్ టెక్నాలజీని ఇందులో అందించారు.ఇది 17 నిమిషాల్లో మొబైల్‌ను 100% ఛార్జ్ చేస్తుంది.

వన్‌ప్లస్ 9ఆర్టీ 5జీ

వన్‌ప్లస్ 9ఆర్టీ 5జీ ఫోన్‌లో 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.62 అంగుళాల ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 11, క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌ అందించారు.ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.ఈ 65W ఫాస్ట్ ఛార్జర్ 4500ఎంఏహెచ్ డ్యూయల్-సెల్ బ్యాటరీని 30 నిమిషాల కంటే తక్కువ సమయంలో 100% ఛార్జ్ చేస్తుంది.

టెక్నో స్పార్క్ 8 ప్రో

గేమింగ్ స్మార్ట్‌ఫోన్ టెక్నో స్పార్క్ 8 ప్రో కేవలం 60 నిమిషాల్లోనే 0 నుంచి 85 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.ఈ స్మార్ట్‌ఫోన్ 33W క్లాస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.ఈ ఫోన్‌లో హీలియో జీ 85 ప్రాసెసర్, 6.8-అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేని అందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube