1.సూరత్గుజరాత్లోని సూరత్ నగరం.
సిటీ ఆఫ్ డైమండ్స్ లేదా డైమండ్ సిటీగా ప్రసిద్ధి చెందింది.ప్రస్తుతం భారతదేశంలో నివసించడానికి ఇది ఉత్తమమైన నగరం.2.పూణేమహారాష్ట్ర సాంస్కృతిక రాజధానిగా పేరొందిన పూణే నగరం ప్రస్తుతం భారతదేశంలో నివసించడానికి రెండవ ఉత్తమ నగరంగా ఉంది.ఇక్కడ ఉద్యోగాలలో అపారమైన అవకాశాలున్న కారణంగా లక్షలాది మంది యువత దృష్టిని ఆకర్షిస్తోంది.3.అహ్మదాబాద్మాంచెస్టర్ ఆఫ్ ది ఈస్ట్గా పేరొందిన అహ్మదాబాద్ నగరం నాణ్యత, మౌలిక సదుపాయాల పరంగా ప్రస్తుతం నివసించడానికి భారతదేశంలో మూడవ ఉత్తమ నగరంగా గుర్తింపు పొందింది.4.ముంబై26/11 దాడుల తరువాత నుంచి ముంబై నగరం భద్రతా కోణంలో చాలా మార్పులకు గురైంది.ఫలితంగా ఈ నగరంలో నివసిస్తున్న జనం ఇప్పుడు తమ నగరాన్ని దేశంలోని అత్యంత సురక్షితమైన నగరాలలో ఒకటిగా పరిగణిస్తున్నారు.5.చెన్నైదక్షిణ భారతదేశ సాంస్కృతిక రాజధానిగా ప్రసిద్ధి చెందిన చెన్నై నగరం సంస్కృతి, ఆర్థిక, వ్యాపార, విద్యకు కేంద్రంగా ఉంది.6.కోల్కతా
కోల్కతా మిస్టీ దహి, రసగుల్లా, సందేశ్లకు ప్రసిద్ధి చెందిన అందమైన నగరం.నేటికీ ఈ నగరంలో బ్రిటిష్ కాలం నాటి కట్టడాలు కనిపిస్తాయి.7.హైదరాబాద్భారతదేశంలోని ఔషధ రాజధానిగా పేరొందిన హైదరాబాద్ నగరం ప్రధాన పర్యాటక కేంద్రంగా కూడా ఉంది.ఐటీ కంపెనీల పెట్టుబడుల వల్ల ఉద్యోగావకాశాలు పెరిగి, యువతను హైదరాబాద్ అమితంగా ఆకర్షిస్తోంది.8.బెంగళూరుభారతదేశ ఆర్థిక వ్యవస్థలో బెంగుళూరు నగరం ప్రత్యేక సహకారాన్ని కలిగి ఉంది.9.జైపూర్పింక్ సిటీగా పేరొందిన జైపూర్ నగరం భారతదేశంలోని ప్రధాన పర్యాటక కేంద్రం.ఇది ఆసియాలో బంగారం, వజ్రాలు, రాతి ఆభరణాల ఎగుమతి కేంద్రంగా కూడా పేరొందింది.10.చండీగఢ్భారతదేశంలోని అత్యంత అందమైన నగరాలలో ఇది ఒకటి.చండీగఢ్ పర్యావరణ పరంగా భారతదేశంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.