వడ్లు కొనెవరకు ఉద్యమం ఆగదు:-ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య

సీఎం కెసిఆర్, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయాలని చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఖమ్మం నగరంలో సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు.ఖమ్మంలోని ఆయన నివాసం వద్ద టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు,ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతుల ఆధ్వర్యంలో నల్ల జెండాలను ప్రదర్శిస్తూ,తన ఇంటికి నల్ల జెండాలు కట్టి నిరసన వ్యక్తం చేశారు.

 The Movement Will Not Stop Till The End Of The Day: -mla Sandra Venkata Virayya-TeluguStop.com

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ రైతాంగాన్నీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నట్టేట ముంచిందని ఆరోపించారు.తెలంగాణ రాష్టంలో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేసే వరకు తమ పోరాటం ఆగదని ఎమ్మెల్యే సండ్ర హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో లో పసుమర్తి చందర్రావు టిఆర్ఎస్ రైతు సంఘం నాయకులు నల్లమోతు రామారావు మోదుగ వీరభద్రం టిఆర్ఎస్ నాయకులు ఇంక నువ్వు సీతయ్య యూ పుల్లారావు పాలూరి హనుమంతరావు జవాజి వెంకట్రావు వికల వెంకటేశ్వర్లు ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube