గిరిజన రిజర్వేషన్లపై డ్రామాలడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

గిరిజన రిజర్వేషన్ల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతున్నాయని, ఇది ఎంతో కాలం సాగదని, గిరిజనులపై నిజంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రేమ ఉంటే, వెంటనే రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని తెలంగాణ బహుజన జేఏసీ రాష్ట్ర చైర్మన్ బానోతు భద్రు నాయక్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

ఓ ప్రశ్నకు సమాధానంగా పార్లమెంట్లో కేంద్ర గిరిజన వ్యవహారాల సహాయ మంత్రి బిశ్వ శ్ వల్ తుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపలేదని పేర్కొనడం, దానిపై టీఆర్ఎస్ ఎంపీలు మండి పడటం, తెలంగాణలో ఆందోళన కార్యక్రమాలు తగలబెట్టడం అంతా డ్రామా వలే ఉందని విమర్శించారు.

రిజర్వేషన్ల అంశాన్ని, టి.అర్.ఎస్.ఎంపీలు సరైన సమయం చూసుకొని ఈ అంశాన్ని ఎత్తుకొని ,ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బిల్లుపై నిజంగా ప్రేమ గనుక ఉంటే ముస్లిం మైనార్టీల రిజర్వేషన్లను, గిరిజన రిజర్వేషను ఒకే గాటన కట్టకుండా పంపించి ఉంటే బాగుండేదన్నారు.

అలా కాకుండా పంపించే విధానంతోనే టిఆర్ఎస్ చిత్తశుద్ధి అర్థమవుతుందన్నారు.అదే విధంగా ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు అనడం లోనూ , ఈ అంశాన్ని , ముస్లిం మైనార్టీల రిజర్వేషన్ బిల్లులో కలిపి పంపించారని చెప్పడంలోనూ, కేంద్ర మంత్రి దాట వేత వైఖరి బిజెపి చిత్తశుద్ధిని చాటుతోంది అన్నారు.

ఇప్పటికైనా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల రిజర్వేషన్ల అంశంపై తమ ,తమ డ్రామాలను ఆపి , గిరిజన దామాషా ప్రకారం రిజర్వేషన్ల ఫలాలు అందజేసే ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

Advertisement
వైరల్ వీడియో : విమానంలో కొట్టేసుకున్న ప్రయాణికులు.. చివరకు..

Latest Khammam News