వాటి గురించి నాకేం తెలియదు అంటూనే సినిమా ప్రమోషన్ చేస్తున్న నటి సోనాల్ చౌహాన్!

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఈ ఏడాది బంగార్రాజు చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో నాగార్జున తన తదుపరి చిత్రం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ చిత్రంలో నటిస్తున్నారు.

 Actress Sonal Chouhan Doing Nagarjuna The Ghost Movie Promotions Details, Actre-TeluguStop.com

ప్రస్తుతం ఈ సినిమా దుబాయ్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది.అయితే దాదాపు కొంత కాలం నుంచి ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు.

ఈ క్రమంలోనే చాలా రోజుల తర్వాత చిత్ర బృందం ఈ సినిమా నుంచి అప్డేట్ విడుదల చేశారు.చిత్ర బృందం దుబాయ్ లో అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక ఈ సినిమాలో నాగార్జున గ్లామర్ లుక్ లో కూడా కనిపించనున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటిస్తున్న సోనాల్ చౌహాన్ తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తోంది.

ఇకపోతే ఈ సినిమాలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించాల్సి ఉండగా ప్రెగ్నెన్సీ కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.

ఇక కాజల్ తర్వాత అమలాపాల్ పేరు తెరపైకి వచ్చింది.చివరికి ఈ సినిమాలో నటించే అవకాశాన్ని నటి సోనాల్ చౌహాన్ దక్కించుకున్నారు.ఇలా ఉన్నఫలంగా ఆ హీరోయిన్ పాత్రలో సోనాల్ చౌహాన్ ను రిప్లై చేయడం వెనుక కారణం తనకు తెలియదంటూనే ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ప్రస్తుతం సోనాల్ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube