లొకేషన్స్ వేటలో పుష్ప రాజ్ టీమ్.. అంత సెట్ అవుతే త్వరలోనే షూటింగ్?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం పుష్ప.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో మంచి ప్రేక్షకాదరణ దక్కించు కుంది.

 Pushpa Raj Team In Hunt For Locations If It Is Set Then Shooting Soon, Pushpa Pa-TeluguStop.com

ఇదిలా ఉండగా ఈ సినిమా అన్ని భాషలలో మంచి విజయం సాధించి ఏకంగా వందల కోట్ల కలెక్షన్లను రాబట్టింది.ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు దర్శకుడు ముందుగానే తెలియజేశారు.

ఈ క్రమంలోని మొదటిభాగం అఖండమైన విజయాన్ని అందుకోవడంతో డైరెక్టర్ తదుపరి ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు.

పుష్ప పార్ట్ 1 మంచి విజయం సాధించడంతో రెండవ పార్ట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అయితే ముందుగా ఈ సినిమా చిత్రీకరణ పార్ట్ 1 షూటింగ్ జరిగిన ప్రదేశంలోనే చేయాలని చిత్ర బృందం భావించగా ప్రస్తుతం వారి ఆలోచనలు మార్చుకున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమా చిత్రీకరణ కోసం లొకేషన్ వేటలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది.

పుష్ప సినిమా నార్త్ ఇండియా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టు కోవడంతో పుష్ప 2 చిత్రీకరణను ఎక్కువగా నార్త్ ఇండియాలోనే చిత్రీకరించాలని డైరెక్టర్ సుకుమార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక పుష్ప పార్ట్ వన్ లో అల్లుఅర్జున్ స్మగ్లర్ గా కనిపించారు.ఇక తదుపరి పార్ట్ 2 లో అల్లుఅర్జున్ స్మగ్లర్ డాన్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే స్క్రిప్ట్ పనులన్నీ పూర్తి కాగా ఈ సినిమా చిత్రీకరణ లొకేషన్ కోసం వేట మొదలు పెట్టారు.

అన్ని సక్రమంగా సెట్ అయితే త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Pushpa Raj Team In Hunt For Locations If It Is Set Then Shooting Soon

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube