లొకేషన్స్ వేటలో పుష్ప రాజ్ టీమ్.. అంత సెట్ అవుతే త్వరలోనే షూటింగ్?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం పుష్ప.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో మంచి ప్రేక్షకాదరణ దక్కించు కుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమా అన్ని భాషలలో మంచి విజయం సాధించి ఏకంగా వందల కోట్ల కలెక్షన్లను రాబట్టింది.

ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు దర్శకుడు ముందుగానే తెలియజేశారు.ఈ క్రమంలోని మొదటిభాగం అఖండమైన విజయాన్ని అందుకోవడంతో డైరెక్టర్ తదుపరి ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు.

పుష్ప పార్ట్ 1 మంచి విజయం సాధించడంతో రెండవ పార్ట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అయితే ముందుగా ఈ సినిమా చిత్రీకరణ పార్ట్ 1 షూటింగ్ జరిగిన ప్రదేశంలోనే చేయాలని చిత్ర బృందం భావించగా ప్రస్తుతం వారి ఆలోచనలు మార్చుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా చిత్రీకరణ కోసం లొకేషన్ వేటలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది.

"""/" / పుష్ప సినిమా నార్త్ ఇండియా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టు కోవడంతో పుష్ప 2 చిత్రీకరణను ఎక్కువగా నార్త్ ఇండియాలోనే చిత్రీకరించాలని డైరెక్టర్ సుకుమార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక పుష్ప పార్ట్ వన్ లో అల్లుఅర్జున్ స్మగ్లర్ గా కనిపించారు.ఇక తదుపరి పార్ట్ 2 లో అల్లుఅర్జున్ స్మగ్లర్ డాన్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే స్క్రిప్ట్ పనులన్నీ పూర్తి కాగా ఈ సినిమా చిత్రీకరణ లొకేషన్ కోసం వేట మొదలు పెట్టారు.

అన్ని సక్రమంగా సెట్ అయితే త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

లోకేష్ ఈ సినిమాలను పూర్తి చేయడానికి ఎంత తక్కువ టైం తీసుకున్నాడో తెలిస్తే !