ఈ మధ్య కాలంలో ఒకటి లేదా రెండు సినిమాలలో హీరోహీరోయిన్లు కలిసి నటిస్తే వాళ్ల మధ్య ఏదో ఉందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయనే సంగతి తెలిసిందే.కొంత మంది సెలబ్రిటీలు ఆ వార్తలను ఖండిస్తుంటే మరి కొందరు సెలబ్రిటీలు మాత్రం ఆ వార్తల గురించి స్పందించటానికి అస్సలు ఇష్టపడటం లేదు.
అయితే తాజాగా సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఈ ఏడాదే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి అంటూ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
విజయ్, రష్మికల గురించి ఈ తరహా వార్తలు ప్రచారంలోకి రావడం ఇదే తొలిసారి కాదు.
గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలలో విజయ్, రష్మిక కలిసి నటించారు.అయితే వైరల్ అవుతున్న వార్తలు విజయ్ దేవరకొండ దృష్టికి రావడంతో ఈ వార్తల గురించి విజయ్ ఘాటుగా స్పందించారు.
ప్రస్తుతం లైగర్ సినిమాతో బిజీగా ఉన్న ఈ హీరో వైరల్ అయిన వార్త గురించి నాన్ సెన్స్ అంటూ స్పందించారు.
వైరల్ అయిన వార్త ఫేక్ వార్త అని విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చేశారు.
విజయ్ దేవరకొండ స్పష్టత ఇవ్వడంతో ఇకనైనా ఈ వార్త ఆగి పోతుందేమో చూడాలి.విజయ్ దేవరకొండ ఈ వార్త గురించి బూతులు తిడుతూ తన చిరాకును, అసహనాన్ని ప్రదర్శించారు.
విజయ్, రష్మిక ప్రస్తుతం వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉండగా ఈ ప్రాజెక్టులపై మంచి అంచనాలు నెలకొన్నాయి.పాన్ ఇండియా స్టార్స్ గా గుర్తింపును తెచ్చుకోవడానికి విజయ్, రష్మిక ప్రయత్నిస్తున్నారు.
అవకాశాలతో బిజీ అవుతున్న తరుణంలో ఇలాంటి వార్తల వల్ల సెలబ్రిటీల కెరీర్ పై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు అయితే ఉంటాయి.గతంలో కూడా విజయ్ దేవరకొండ పలు సందర్భాల్లో ఫేక్ వార్తలపై మండిపడ్డారనే సంగతి తెలిసిందే.వైరల్ అవుతున్న ఫేక్ వార్తలు విజయ్, రష్మిక కుటుంబ సభ్యులను సైతం ఇబ్బంది పెడుతున్నాయి.