ఇండియా, 10 ఫిబ్రవరి 2022 : ఫిబ్రవరి నెల వచ్చిందంటేనే వాతావరణమంతా ప్రేమ, సంతోషంతో నిండిపోతుంది ! ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవాన్ని వేడుక చేస్తుంటారు.భారీ వేడుకలు, ఫ్యాన్సీ డిన్నర్లు మరియు ప్రియమైన వారికి ఆనందాన్ని కలిగిస్తూ బహుమతులు అందించడం కనిపించేదీ ఇప్పుడే ! అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే ఆ రోజున ప్రేమ, అనురాగం వ్యక్తీకరించడానికి మించిన సందర్భం ఏముంటుంది? అలాగే మీ జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తి – అది మీ స్నేహితులు, ప్రేమికులు లేదా కుటుంబ సభ్యులు– తో గడపటానికి ఇంతకుమించిన సందర్భమేముంటుంది ?.
అయితే, మహమ్మారి విజృంభణతో మీ భద్రత కోసం మీరు జాగ్రత్తపడటం తప్పనిసరి అయింది.ఆరోగ్యవంతమైనది తినడం మరియు ఆరోగ్యవంతమైన రోగనిరోధక వ్యవస్థను నిర్వహించడం కోసం ఫిట్‌గా ఉండటం తప్పనిసరి అయింది.
అందువల్ల, ఈ సంవత్సరం వాలెంటైన్స్ డే రోజున మీ ప్రియమైన వారితో పంచుకోవడానికి ఆలోచనాత్మకమైన బహుమతులను ఎంచుకోండి.ఆ తరహా బహుమతులలో ఒకటి బాదం.దీనిలో చక్కటి పోషకాలు, ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణాలు ఉన్నాయి.బాదములలో 15కు పైగా పోషకాలు అయినటువంటి విటమిన్ ఈ, మెగ్నీషియం, ప్రోటీన్, రిబోఫ్లావిన్, జింక్ మొదలైనవి ఉన్నాయి.
గుండె ఆరోగ్యం మెరుగుపరిచేందుకు, చర్మ ఆరోగ్యం, బరువు నిర్వహకు సైతం ఇవి తోడ్పడతాయి.వీటితో పాటుగా బ్లడ్ షుగర్ నిర్వహించడంలోనూ బాదములు తోడ్పడతాయి.
తమిళ నటి, సెలబ్రిటీ నిషా గణేష్ మాట్లాడుతూ ‘‘ప్రేమికుల దినోత్సవం రోజున బహుమతులు పంచుకోవడం తప్పనిసరి.నా ప్రియమైన వారికి ఏమైనా అంశాలు కొనుగోలు చేయాలంటే అవి ఆలోచనాత్మకంగా ఉండాలని కోరుకుంటుంటాను.
నేనెప్పుడూ కూడా నేనందించే బహుమతులు ప్రయోజనకరంగా ఉండటంతో పాటుగా దీర్ఘకాలంలో అవి ఉపయుక్తంగా ఉండాలని కోరుకుంటుంటాను.అందువల్ల, ఈ సంవత్సరం మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నేను బాదములను బహుమతిగా అందించాలనుకుంటున్నాను.
అవి సహజసిద్ధంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించే పోషకాలు అయినటువంటి రాగి, జింక్, ఐరన్, ఫోలేట్, విటమిన్ ఈ కలిగి ఉన్నాయి’’ అని అన్నారు.
న్యూట్రిషన్ మరియు వెల్‌నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ ‘‘ప్రేమికుల దినోత్సవం రోజున బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడమన్నది సాధారణం.వాటిలో మనం ఏమి జోడించాలనే అంశమై ఆలోచనాత్మకంగా ఉండాలి.చాలా వరకూ మనం అందించే బహుమతులు చక్కెర పాకంలో రూపుదిద్దుకున్నవే అయి ఉంటాయి.
అవి ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదు.ఈ కారణం చేతనే, నేను మన ప్రియమైన వారికి సుదీర్ఘకాలంలో ప్రయోజనం కలిగించే ఆహారం అందించాలని చెబుతుంటాను.
ఆ తరహా ఆహారాలలో బాదములు ఒకటి.బాదములతో జీవనశైలి వ్యాధులు అయినటువంటి మధుమేహం లాంటివి నిర్వహించవచ్చు.
భారతదేశంలో అతి సహజంగా కనిపిస్తున్న జీవనశైలి వ్యాధిగా బాదములు నిలుస్తున్నాయి.పరిశోధనలు చూపేదాని ప్రకారం , బాదములతో బ్లడ్ షుగర్ తగ్గుతుంది.
మనం తినే కార్బో హైడ్రేట్ ఆహారం కారణంగా మధుమేహం పెరిగే అవకాశాలున్నాయి.ఈ కార్బోహైడ్రేట్స్ కారణంగా ఇన్సులిన్ స్ధాయి పెరిగే అవకాశమూ ఉంది’’ అని అన్నారు.
సుప్రసిద్ధ ఫిట్‌నెస్, సెలబ్రిటీ ఇన్‌స్ట్రక్టర్, యాస్మిన్ కరాచివాలా మాట్లాడుతూ ‘‘ మీ ప్రియమైన వారిని వేడుక చేసే అత్యుత్తమ రోజు ప్రేమికుల దినోత్సవం.వారికి అవసరమైన ప్రేమ, సంరక్షణను అందిస్తున్నామని ప్రదర్శించే రోజు కూడా ఇది.అయితే, దీనిని చూపడానికి ఎన్నో మార్గాలున్నాయి.వాటిలో డిన్నర్‌కు వెళ్లడం, బహుమతులు కొనుగోలు చేయడం కూడా ఉన్నాయి.
మీరు వీటికి ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్ వ్యాయామాలు లేదా పిలాట్స్ క్లాస్‌కు హాజరు కావడం మరియు వారితో కలిసి వర్కవుట్స్‌కు హాజరుకావడం చేయవచ్చు.రెగ్యులర్ ఫిట్‌నెస్ రొటీన్‌తో పాటుగా మీరు వారికి బాదములు లాంటి ఆరోగ్యవంతమైన స్నాక్స్ కూడా అందించవచ్చు.
ఇవి వర్కవుట్‌కు ముందు మరియు తరువాత ఆహారంగా కూడా నిలుస్తాయి.బాదములు మనకు కావాల్సిన శక్తిని అందించడంతో పాటుగా ఆకలిని తీర్చే గుణాలను కలిగి ఉంటాయి.దీనివల్ల కొద్దిగా తిన్న వెంటనే కడుపు నిండిందన్న భావన కలుగుతుంది.ఫిట్‌నెస్ ప్రయాణంలో తోడ్పడటానికి ఇవి సహాయపడతాయి.
మీ ప్రియమైన వారి ఫిట్‌నెస్‌కు కట్టుబడి ఉండటమనేది ఈ ప్రేమికుల దినోత్సవ వేళ మీరు వారికి అందించే అత్యుత్తమ బహుమతి’’ అని అన్నారు.అందువల్ల, బాదములు లాంటి ఆలోచనాత్మక బహుమతులతో ఈ ప్రేమికుల దినోత్సవాన్ని మరింత ప్రత్యేకంగా మార్చండి !
.