టీఆర్ఎస్ నాయకులకు కేసీఆర్ కీలక సూచనలు.. ఎందుకంటే?

తెలంగాణ రాజకీయం మొత్తం బీజేపీ, టీఆర్ఎస్ ల మాటల తూటాలతో ఆసక్తికరంగా ఉంది.అయితే బీజేపీపై తీవ్ర స్థాయిలో ఒంటి కాలుపై లేస్తున్న కెసిఆర్ బీజేపీ త్వరలో వ్యవహారించబోయే తీరుపై పెద్ద ఎత్తున కీలక సూచనలు చేసినట్లు పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

 Kcr Key Hints For Trs Leaders Because , Bjp Party, Kcr , Bandi Sanjay , Bjp , T-TeluguStop.com

  బీజేపీ త్వరలో ఈడీ అస్త్రం ప్రయోగించనున్నదని నాయకులందరు దానికి సిద్ధంగా ఉండాలని నేతలకు సూచించారట.అయితే దీనిపై అధికారికంగా టీఆర్ఎస్ నాయకులు ఎవరూ వ్యాఖ్యానించక పోయినా కొంత విశ్వసించదగ్గ చర్చ మాత్రం జరిగినట్లు తెలుస్తోంది.

ప్రతి ఒక్క రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పార్టీలపై కేంద్రం ఈడీ, సీబీఐ అస్త్రం ఉపయోగిస్తున్న ఘటనలను మనం చూసాం.అయితే కేసీఆర్ భావిస్తున్నట్టు బీజేపీ ఈడీ అస్త్రం ప్రయోగిస్తే తెలంగాణ రాష్ట్ర రాజకీయం నివురుగప్పిన నిప్పులా తయారయ్యే అవకాశం ఉంది.

ఇప్పుడే దీనిపై ఎక్కువగా విశ్లేషించుకోవడానికి ఎక్కువగా అవకాశం లేకపోయినా రానున్న రోజుల్లో మరింతగా దీనిపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.అయితే అన్ని రాష్ట్రాలలో వ్యవహరించినట్లుగా తెలంగాణ వ్యవహరిస్తే కొంత బీజేపీ వ్యతిరేక పవనాలు వీచే అవకాశం ఉంది.

ఎందుకంటే కెసీఆర్ మాటను విన్నట్లుగా ప్రజలు ఏ ఇతర రాజకీయ నాయకుడి మాటలను వినే అవకాశం లేదు.అయితే ఒకవేళ బీజేపీ ఈడీ సీబీఐ అస్త్రం ఉపయోగించినా దానిని రాజకీయంగా తనకు అనుకూలంగా కెసీఆర్ వాడుకునే అవకాశం ఉండేది.

దీంతో బీజేపీ ఇప్పటివరకు ఎంతో కొంత బలపడినదంతా ఒక్కసారిగా నష్టపోవడమే కాక ఇక బీజేపీని ప్రజల్లో శాశ్వత దోషిగా నిలబెట్టే వ్యూహాన్ని కూడా కెసీఆర్ ప్రయోగించినా ఆశ్చర్యపోనక్కరలేదు.ఏది ఏమైనా రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయం రంజుగా మారే అవకాశాలు వందకు  వంద శాతం కనిపిస్తున్నాయి.

KCR Key Hints For TRS Leaders Because , Bjp Party, Kcr , Bandi Sanjay , BJP , TRS , Ed , CBI - Telugu @bandisanjay_bjp, @bjp4telangana, @cm_kcr, Telangana

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube