వారితో భేటీ కానున్న సంజయ్ ? ఇక సమరమే ?

టిఆర్ఎస్ ఈ విషయంలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది.ఏ చిన్న సమస్యను వదిలి పెట్టకుండా పోరాటం చేస్తూ, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో దాదాపు సక్సెస్ అవుతూనే వస్తోంది.

 Sanjay Going To Meet Them Is It A Struggle, Ts Poltics , Bandi Sanjay , Kcr , T-TeluguStop.com

ప్రస్తుతం చేస్తున్న పోరాటాల కంటే మరింత ఉధృతమైన పోరాటాలు చేపట్టాలని ప్లాన్ చేస్తోంది.ఈ విషయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఉత్సాహంగా ఉన్నారు.దుబ్బాక హుజురాబాద్ ఎన్నికల ఫలితాలతో బండి సంజయ్ క్రేజ్ పెరిగింది.317 జీవో కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడం, ప్రభుత్వం సంజయ్ ను అరెస్టు చేయించడం వంటి వ్యవహారాలపై బీజేపీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది.కేంద్ర మంత్రులతో పాటు , వివిధ రాష్ట్రాల్లో బీజేపీ  ముఖ్యమంత్రులు సైతం తెలంగాణకు వచ్చి పరామర్శించారు.దీంతో మరింత ఉత్సాహంగా ఉన్న సంజయ్ మరింత దూకుడు పెంచారు.

ఈ మేరకు పార్టీకి చెందిన కొంత మంది కీలక నాయకులతో ఆయన సమావేశం నిర్వహించబోతున్నారు.ఈనెల 14వ తేదీన బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు, మరి కొంత మంది పార్టీ కీలక నాయకులతో ఆయన సమావేశం నిర్వహించబోతున్నారు.

ఈ సమావేశంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఏ విధంగా పోరాటం చేయాలి .? ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అనేక అంశాలపై చర్చించనున్నారు.మొన్నటి వరకు బీజేపీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు.అయితే ఇప్పుడు ఆ సంఖ్య మూడుకి చేరుకుంది.దీంతో రాబోయే అసెంబ్లీ సమావేశాలు టిఆర్ఎస్ ను ఇరికించేందుకు ఏ అంశాలపై అసెంబ్లీలో చర్చ లేవనెత్తాలి ? ఏ విధమైన అంశంతో ముందుకు వెళ్లాలి అనే అనేక అంశాలపై సంజయ్ చర్చించబోతున్నారు.

అదే రోజు సమావేశం నిర్వహించాలని సంజయ్ నిర్ణయించుకున్నారు.ఈనెల 16వ తేదీన యువ తెలంగాణ పార్టీ ని టీఆర్ఎస్ లో విలీనం చేయబోతూ ఉండడం, ఆ సభను భారీస్థాయిలో నిర్వహించి టిఆర్ఎస్ కు వణుకు పుట్టించాలని సంజయ్ ప్లాన్ చేస్తున్నారు.పెద్ద ఎత్తున చేరికలపైనా దృష్టిపెట్టిన సంజయ్ ఈ నెల 14న నిర్వహించబోయే సమావేశంలో చేరికల అంశాన్ని ప్రధానంగా చర్చించనున్నారు.

Sanjay Going To Meet Them Is It A Struggle, Ts Poltics , Bandi Sanjay , Kcr , Trs Party , Bjp Party , Etala Rajender , Raghu Nandhana Rao , Bjp Candiadats - Telugu Bandi Sanjay, Bjp Candiadats, Bjp, Etala Rajender, Trs, Ts Poltics

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube