బాలయ్య గోడ దూకాడట.. ఎందుకో తెలుసా..?

నందమూరి బాలకృష్ణ గోడ దూకాడట.బాలయ్య ఏంటి గోడ దూకడం ఏంటని అనుకోవచ్చు.

 Balakrishna Kbr Park Wall Jumping Unstoppable Secret, Balakrishna, Kbr Park, Mah-TeluguStop.com

ఇప్పుడు స్టార్స్ గా ఉన్న అందరు యంగ్ ఏజ్ లో ఏదో ఒక చిలిపి పనులు చేసి ఉంటారు.స్టార్స్ విషయాలు వారు చెబితేనే కాని అందరికి తెలియదు.

ఈ క్రమంలో లేటెస్ట్ గా అన్ స్టాపబుల్ షోలో బాలయ్య బాబు తను గోడ దూకిన విషయాన్ని చెప్పారు.అన్ స్టాపబుల్ ఫైనల్ ఎపిసోడ్ కి సూపర్ స్టార్ మహేష్ గెస్ట్ గా రాగా ఆయన తన కె.బి.ఆర్ పార్క్ జాగింగ్ అనుభవాన్ని చెప్పుకొచ్చారు.పార్క్ చుట్టూ ఒక రౌండ్ వేసే సరికి పొదల్లో ఒక పాము పడగ విప్పి కనిపించిందని.మళ్లీ రిటర్న్ 5 కిలోమీటర్లు జాగింగ్ చేసి ఇంటికి వచ్చానని.

అప్పటి నుండి ఇప్పటివరకు కె.బి.ఆర్ పార్క్ వంక చూడలేదని అన్నారు.

అయితే ఈ క్రమంలో బాలయ్య మాత్రం తాను కె.

బి.ఆర్ పార్క్ గేటు కూడా ఓపెన్ చేయకపోతే గోడ దూకి మరి పార్క్ లో జాగింగ్ చేశానని అన్నారు.ఆ వాచ్ మెన్ తనని గుర్తుపట్టకపోతే నేనయ్యా బాలకృష్ణని అని చెప్పి మరి నువ్వు ఉదయం నాలుగున్నర గంటలకు గేటు తీయి లేదంటే నేను గోడ దూకి రావాల్సి వస్తుందని అన్నారని షోలో చెప్పారు.మొత్తానికి మహేష్ తో ఎపిసోడ్ అద్భుతంగా సాగిందని చెప్పొచ్చు.

బాలకృష్ణ లోని మరో యాంగిల్ ఈ షో ద్వారా బయటకు వచ్చిందని మాత్రం ఖచ్చితంగా అర్ధమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube