అటు సినిమా రంగంలో ఇటు రాజకీయాల్లో సక్సెస్ సాధించిన వాళ్లలో ఎమ్మెల్యే రోజా కూడా ఒకరనే సంగతి తెలిసిందే.వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా మంత్రి పదవిని ఆశిస్తుండగా త్వరలో ఆమెకు మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
సినిమాలపై ఆసక్తి చూపని రోజా తనకు మంచి గుర్తింపు రావడానికి కారణమైన జబర్దస్త్ షోకు మాత్రం జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ కాగా ఈ ప్రోమోలో మనో రోజా గురించి పాజిటివ్ గా చెబుతూ స్కిట్ లో చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
రాకేష్ ఆడవాళ్లకు స్వేచ్ఛ ఇస్తే ఏమవుతుందో మీకు తెలుసా అని చెప్పగా స్వేచ్ఛ ఇస్తే ఎటువంటివి సాధించారో తెలుసా ఎదురుగా చూడు అంటూ మనో రోజాను చూపించారు.అఆల దగ్గర ఆపేసి ఉంటే రోజా అసెంబ్లీకి వెళ్లేదా ఏబీసీడీల దగ్గర ఆపేసి ఉంటే ఎమ్మెల్యే అయ్యేదా అని మనో కామెంట్లు చేశారు.
పగలూరాత్రి తేడాలేకుండా ప్రతిరోజూ రోజా కష్టపడిందని అందువల్లే రోజా ఈ స్థాయికి చేరుకుందని మనో అన్నారు.మనో రోజా గురించి గొప్పగా చెబుతుండగా బ్యాక్ గ్రౌండ్ లో వకీల్ సాబ్ మ్యూజిక్ వచ్చింది.ఆ తర్వాత మనో రష్మీ గురించి చెబుతూ ఆడవాళ్లు సినిమా టాకీస్ కు వెళ్లలేని ఈరోజుల్లో రష్మీ గుంటూరు టాకీస్ వరకు వెళ్లిందని తెలిపారు.ఆడవాళ్లను బయటకు రానిచ్చి స్వేచ్ఛగా తిరగనిచ్చి వాళ్ల లక్ష్యాలను సాధించనివ్వాలని మనో తెలిపారు.
నువ్వేం అవ్వాలని అనుకుంటున్నావని మనో ఇద్దరు అమ్మాయిలని అడగగా ఒక అమ్మాయి ఎమ్మెల్యే కావాలని అనుకుంటునానని చెబితే మరో అమ్మాయి మంచి కమెడియన్ కావాలని అనుకుంటున్నానని చెబుతుంది.కమెడియన్ కావాలని చెప్పిన అమ్మాయితో జడ్జిగా నేను చెప్పలేనని నువ్వు ట్రై చేసుకో అంటూ మనో పంచ్ వేశారు.ఈ నెల 28వ తేదీన రాత్రి 9.30 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.