మొగులయ్యకు పద్మశ్రీ అవార్డు.. స్పందించిన పవన్ కళ్యాణ్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

 Padma Shri Award For Kinnera Artist Mogulaiah And Pawan Kalyan Reaction On Padm-TeluguStop.com

ఇక ఈ సినిమాలో టైటిల్ సాంగ్ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రెండ్ అయిన సంగతి మనకు తెలిసిందే.ముఖ్యంగా ఈ పాటను మొగిలయ్య తను 12 మెట్ల కిన్నెర వాయిద్యం వాయించి ఎంతో అద్భుతంగా పాడారు.

అయితే నేటి తరం వారికి ఈ కిన్నెర వాయిద్యం గురించి చాలా మందికి తెలియక పోవచ్చు.

ఇలా తన తాత ముత్తాతల నుంచి వస్తున్న ఈ కళ అంతరించిపోతున్న నేపథ్యంలో ఈ కలను బతికించాలని మొగులయ్య ఎంతో తాపత్రయ పడ్డారు.

అయితే ఆయన పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని చెప్పాలి.అంతరించిపోతున్న కలను బ్రతికించాలి అనే ఆయన తపనకు మంచి గుర్తింపు లభించింది.

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసిన మొగిలయ్యకు కిన్నెర వాయిద్యం గురించి పాఠ్యపుస్తకాలలో ప్రచురించి మంచి గుర్తింపు తీసుకు వచ్చారు.

Telugu Kinneret, Padma Awards, Pawan Kalyan-Movie

నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన మొగిలయ్య 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో ఆడా లేడు మియా సాబ్.ఈడా లేడు మియా సాబ్ అంటూ మొదలయ్యే పాడిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ చిత్రం కోసం చరణాలను మార్చి ఈ పాట సహజత్వాన్ని కోల్పోకుండా సరాసరి మొగిలయ్యతోనే ఈ పాటను పాడించారు.ఇలా మొగిలయ్య భీమ్లా నాయక్ సినిమాలో ఆడా గాదు, ఈడా గాదు అమీరోళ్ళ మేడా గాదు.

పుట్టిండాడు పులి పిల్ల… అంటూ సాగే ఈ పాటను మొగిలయ్య కిన్నెర వాయిద్యం వాయిస్తూ ఎంతో అద్భుతంగా పాడారు.ఇలా సోషల్ మీడియాలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో మొగిలయ్య పెద్దఎత్తున వార్తల్లో నిలిచారు.

ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్, పద్మ విభూషణ్, పద్మశ్రీ అవార్డులలో భాగంగా కిన్నెర వాయిద్యకారుడు మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డును ప్రకటించడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఈ అవార్డు గ్రహీతలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube