శరత్ బాబుతో నమిత పెళ్లి అంటూ వచ్చిన వార్తలు.. ఛీ ఇది వరస్ట్ అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సొంతం, జెమిని, సింహ, బిల్లా వంటి చిత్రాల ద్వారా అందరికీ సుపరిచితమైన గుజరాతి ముద్దుగుమ్మ నమిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమెకు తెలుగు తమిళ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం అందరికి తెలిసిందే.

 News That Namitha Is Getting Married To Sarath Babu  Is This  Real , Namitha Sar-TeluguStop.com

తమిళంలో ఈ ముద్దుగుమ్మకు ఏకంగా గుడి కట్టే అంత అభిమానులు ఉన్నారు.ఇలా తెలుగు తమిళ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించడమే కాకుండా బుల్లితెర పై పలు కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నమిత2017వ సంవత్సరంలో వీరేంద్ర చౌదరి అనే తెలుగు అబ్బాయిని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ప్రముఖ వ్యాపారవేత్తగా నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకున్న తర్వాత నమిత పూర్తిగా తన వ్యక్తిగత జీవితానికి పరిమితమయ్యారు.ఇండస్ట్రీలో ఇలా బోల్డ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న నమిత వివాహమైన తన గురించి పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఈ వార్తల గురించి ఎప్పుడు స్పందించని నమిత భర్త వీరేంద్ర చౌదరి తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని తన గురించి వస్తున్న రూమర్ల గురించి ప్రస్తావించారు.

ఈ సందర్భంగా వీరేంద్ర చౌదరి మాట్లాడుతూ రూమర్లు రావడం సర్వసాధారణం ఒక వ్యక్తి గురించి మనకు తెలిసిన అప్పుడు మనం వాటి గురించి పట్టించుకోవాల్సిన పని లేదు.

ఇలాంటి వాటిని విని నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాము.అయితే కొన్నిసార్లు మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి.

ఇక నమిత గురించి వచ్చిన రూమర్ల లో వరెస్ట్ రూమర్ ఏంటి అంటే అది నమిత సీనియర్ నటుడు శరత్ బాబును వివాహం చేసుకున్నారు అనే వార్త అంటూ వీరేంద్ర చౌదరి చెప్పుకొచ్చారు.

ముఖ్యంగా ఈ వార్త మా పెళ్ళి టైంలో బాగా స్ప్రెడ్ అయిందని, అయినా మేము వీటి గురించి ఆలోచించలేదని తెలిపారు.అసలు శరత్ కుమార్ ఎక్కడ నమిత ఎక్కడ ఆయన ఒక పెద్ద సీనియర్ నటుడు అలాంటి ఆయనతో పెళ్లి జరగడం ఏంటి? ఇలాంటివన్నీ కావాలనే సృష్టిస్తుంటారు అంటూ ఈయన తన భార్య నమిత గురించి వస్తున్న వార్తలను కొట్టిపారేశారు.బహుశా ఈ వార్త విన్న శరత్ కుమార్ గారూ కూడా చాలా బాధపడి ఉంటారు.

అంటూ వీరేంద్ర చౌదరి నమిత గురించి వస్తున్న వార్తలపై స్పందించారు.

Namitha Husband Veerendra On Namitha Sarath Babu Marriage Rumours

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube