టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎస్ ఎస్ థమన్ ఒకరు.ఈయన మొదట్లో ఎన్ని విమర్శలు ఎదుర్కున్నా దృడంగా నిలబడి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు.
ఈయన ప్రెసెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు.అయితే తాజాగా నిన్న థమన్ సోషల్ మీడియాలో ఒక డేట్ పెట్టి ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేసాడు.
ప్రెసెంట్ టాలీవుడ్ లో రిలీజ్ కు రెడీగా ఉన్న అన్ని సినిమాల నుండి కూడా పాటలు రిలీజ్ అయ్యాయి.
ప్రతి సినిమా నుండి కనీసం ఒక్క సాంగ్ అయినా రిలీజ్ అయ్యాయి.
కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా నుండి మాత్రం ఇప్పటి వరకు ఒక్క పాట కూడా రిలీజ్ అవ్వలేదు.ఈ సినిమా ఆల్బం మోస్ట్ ఏవైటెడ్ గానే మిగిలిపోతు వస్తుంది.
సంగీత దర్శకుడు థమన్ ఇచ్చే ఈ ఆల్బం కోసం అంత కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రావాల్సి ఉండగా వాయిదా పడుతూనే వస్తుంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా ఈ ఫస్ట్ సింగిల్ ను అందివ్వలేక పోతున్నట్టు మేకర్స్ చెబుతున్నారు.మరి తాజాగా సోషల్ మీడియా వేదికగా థమన్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు మహేష్ అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తుంది.
ఆయన తన ఖాతాలో ఫిబ్రవరి 14 న అంటే ప్రేమికుల రోజున అన్నట్టుగా డేట్ పెట్టి వదిలేసాడు.
అయితే ఇది పాట కోసమే అని అందరికి అర్ధం అవుతున్నా కానీ అసలు ఏ సాంగ్ కోసమో ఏ సినిమా నుండో అనేది ఎవ్వరికి అర్ధం కావడం లేదు.అయితే ఇప్పుడు థమన్ చేస్తున్న ప్రాజెక్ట్స్ లో ఆల్బమ్ రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్న సినిమా సర్కారు వారి పాట ఒక్కటే.కానీ కేవలం డేట్ ఒక్కటే పెట్టి అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు.
ఏది ఏమైనప్పటికి ఈ డేట్ పెట్టడంతో ఇది కాస్త చర్చకు దారితీసింది.