తాజాగా సికింద్రాబాద్ లోని ఒక క్లబ్ లో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించిన సంగతి మనందరికీ తెలిసిందే.ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో క్లబ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఈ ఘటన జేబీఎస్ సమీపంలోని సికింద్రాబాద్ క్లబ్ లో చోటుచేసుకుంది.ఈ ఘటనలో మంటలు భారీగా ఎగిసిపడడంతో చాలానే ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో భాగంగా క్లబ్ మొత్తం పూర్తిగా తగలబడిపోయిందని సమాచారం.ఇక వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలోనే అక్కడికి దాదాపుగా 10 అగ్నిమాపక యంత్రాలు చేరుకొని ఆ మంటలను అదుపు చేసినప్పటికీ లాభం లేకపోయింది.ఎందుకంటే అప్పటికే జరగాల్సిన భారీ నష్టం జరిగిపోయింది.
అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.తాజాగా ఈ విషయంపై మంచు లక్ష్మి స్పందించింది.
ఈ విషయంపై స్పందిస్తూ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేసింది.ఆ దృశ్యాలను చూసి వార్తలను వింటుంటే ఎంతో బాధగా ఉంది.
ఆ క్లబ్ లో తనకు కూడా ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి అంటూ ఆమె ఎమోషనల్ అయ్యింది.ఈ భవనం హైదరాబాద్ హెరిటేజ్ కట్టడాలలో ఒకటిగా నిలుస్తుంది.
అంతే కాకుండా సికింద్రాబాదులోని ఈ క్లబ్ లో దాదాపుగా పదిహేను లక్షలు కడితే మెంబర్షిప్ లభిస్తుందట.ఈమె క్లబ్ ను 1858లో బ్రిటిష్ హయాంలో మిలటరీ అధికారుల కోసం నవాబ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ నిర్మించారు.ఇక అగ్ని ప్రమాదానికి సంబంధించి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఆ క్లబ్ మంటల్లో కాలి పోవడం కీ సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఘటనలో దాదాపుగా ఇరవై కోట్ల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఇరుగు పొరుగు వారిని వెంటనే ఇల్లు ఖాళీ చేయిస్తున్నారు.