ఈ మధ్యకాలంలో డ్రగ్స్ రవాణా యధేశ్చగా సాగుతోంది.సులభంగా డబ్బులు సంపాదించడం కోసం చాలా మంది తప్పుడు దారుల్లో ప్రయాణం చేస్తున్నారు.
తాజాగా కర్ణాటక హుబ్లీ రైల్వేస్టేషన్లో దాదాపు కిలో పరిమాణంలో డ్రగ్స్ పట్టుబడింది.ఇటువంటి ప్రమాదకరమైన డ్రగ్స్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఉగాండకు చెందిన ఓ మహిళ తనను ఎవ్వరూ పట్టుకోలేరనే ఉద్దేశంతో ఈ పనిని చేసింది.అయితే అధికారులు ఆమె నుంచి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుని ఆమెకు షాక్ ఇచ్చారు.
ఆమె చేసిన పనికి పోలీసులు షాక్ తిన్నారు.నిందితురాలు ఢిల్లీ నుంచి ఆ డ్రగ్స్ ను రవాణా చేయసాగింది.
ఈ విషయాన్ని అధికారులు తెలుసుకున్నారు.పోలీసులకు అనుమానం రాకుండా ఆ మహిళ చిన్నపిల్లలకు ఆహారంగా అందించే సెర్లాక్ ప్యాకెట్లలో రవాణా చేయాలనుకుంది.
ప్లాన్ లో భాగంగా ఆమె డ్రగ్స్ ను సెర్లాక్ ప్యాకెట్లలో రవాణా చేయసాగింది. ఆమె రవాణా చేసే డ్రగ్ చాలా ప్రమాదకరమైనది.
ఈ విషయాన్ని అధికారులు తెలియజేశారు.ఆమె చేరవేసే డ్రగ్స్ ఎక్కువ కాలం పాటు నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి.అంతేకాకుండా గుండె సంబంధిత సమస్యలు, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటివి కూడా జరుగుతాయి.ఈ డ్రగ్స్ తీసుకున్నవారు దుష్ప్రభావాలకు లోనయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.
ప్రస్తుత కాలంలో డ్రగ్స్ కు యువత ఎక్కువగా అలవాటు పడుతోంది.
సినీ ప్రముఖులు కూడా డ్రగ్స్ కేసులలో అరెస్టు అయిన దాఖలాలు కూడా ఉన్నాయి.అంతేకాకుండా రాజకీయ నాయకులు కూడా డ్రగ్స్ వినియోగించి అరెస్టు అయిన సందర్భాలు ఉన్నాయి.మరి ఇటువంటి డ్రగ్స్ దందాను అంతం చేయడానికి పోలీసు అధికారులు అనేక చర్యలు తీసుకున్నప్పటికీ డ్రగ్స్ రవాణా చేయడంతో అనేేక పక్కదార్లు తొక్కుతూ తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు.
అధికారులు వారి చర్యలకు అడ్డుపడుతూ వాటిని కట్టడి చేస్తున్నారు.