'బంగార్రాజు' లో నాగ్ డబుల్‌ రోల్‌.. ట్రిపుల్‌ ధమాకా ఖాయం

అయిదు సంవత్సరాల క్రితం వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా ఘన విజయంను సొంతం చేసుకుంది.ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌ అన్నట్లుగా రూపొందిన బంగార్రాజు సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.

 Nagarjuna Plying Double Role In Bangarraju Movie, Nagarjuna, Bangrraju Movie, Na-TeluguStop.com

సంక్రాంతి కానుకగా రాబోతున్న బంగార్రాజు సినిమా లో నాగార్జున మరియు నాగ చైతన్య లు ఇద్దరు హీరోలుగా కనిపించబోతున్నారు.నాగార్జున బంగార్రాజు కాగా నాగ చైతన్య కూడా బంగార్రాజు గానే కనిపిస్తాడు అంటూ ఇప్పటికే క్లారిటీ వచ్చింది.

అంటే నాగార్జున మనవడి పాత్రలో నాగ చైతన్య కనిపిస్తాడు.నాగార్జున ఎలా అయితే పూల రంగడి వేశాలు వేసేవాడో అలాగే నాగ చైతన్య కూడా తాతకు తగ్గ మనవడు అన్నట్లుగా పూల రంగడి వేషాలతో అందరికి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడట.

ఇక నాగ చైతన్య తండ్రి పాత లో కూడా నాగార్జున కనిపించబోతున్నాడు.అయితే ఆ పాత్రను కొద్ది సమయం మాత్రమే చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ప్లాష్ బ్యాక్ లో నాగార్జున నాగ చైతన్య తండ్రి పాత్రలో కనిపిస్తాడు.

Telugu Bangarraju, Krithi Shetty, Naga Chaitanya, Nagarjuna, Ramya Krsihna-Movie

ఆ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని అంటున్నారు.మొత్తంగా నాగార్జున తండ్రి, కొడుకులుగా కనిపించబోతున్నాడు.నాగ చైతన్య మరియు నాగార్జునలు తాత మనవడిగా కనిపించబోతున్నారు.

సంక్రాంతికి పెద్ద సినిమాలు ఏమీ లేక పోవడంతో బంగార్రాజుకు కలిసి వచ్చే అంశం.పండుగ వంటి సినిమా బంగార్రాజు అనడంలో తప్పు లేదు.

అందుకే సంక్రాంతికి బంగార్రాజు కాస్త పాజిటివ్‌ టాక్ దక్కించుకుంటే వంద కోట్లు ఈజీగా వస్తాయని అంటున్నారు.భారీ అంచనాల నడుమ రూపొందిన బంగార్రాజు సినిమాను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.

ఇక ఈ సినిమా లో కృతి శెట్టి సర్పంచ్ గా కనిపించబోతుంది.ఆమె ఊర్లో ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తుంది.

చైతూ మరియు కృతిల మద్య ఉండే రొమాంటిక్ సన్నివేశాలు సినిమా కు ప్రథాన ఆకర్షణగా నిలుస్తాయనే నమ్మకం అందరిలో వ్యక్తం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube