టాలీవుడ్ బుల్లితెర పై తన యాంకరింగ్ తో తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నాడు యాంకర్ రవి. అంతే కాకుండా ఎంతోమందీ అభిమానులను కూడా సంపాదించుకున్నాడు.
బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా నటుడిగా పరిచయమయ్యాడు.తొలిసారిగా సంథింగ్ స్పెషల్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
ఇక ఈ షోలో తన మాటలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.ఆ తర్వాత వన్ షో, డీ జూనియర్స్, ఫ్యామిలీ సర్కస్, పటాస్ వంటి ఎన్నో ఎంటర్టైన్మెంట్స్ షో లలో యాంకర్ గా చేసి మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.
పలు సినీ ఈవెంట్లలో కూడా యాంకర్ గా చేశాడు రవి.తనకు బుల్లితెర పై క్రేజ్ ఎక్కువగా ఉండటంతో ఏకంగా బిగ్ బాస్ సీజన్ 5 లో అవకాశం అందుకున్నాడు.
ఇక ఈ షోలో యాంకర్ రవి కాస్త నెగిటివిటీ ని కూడా సంపాదించుకున్నాడు.హౌస్ లో ఉన్నంతకాలం బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నాడు.చాలా వరకు యాంకర్ రవి టైటిల్ విన్నర్ గా గెలుస్తాడని అనుకున్నారు.కానీ టాప్ ఫైవ్ లో కూడా ఉండలేకపోయాడు.
ఇక హౌస్ నుండి బయటకు వచ్చాక రవి చేసిన హంగామా అందరికీ తెలిసిందే.
తనపై ట్రోల్స్, మీమ్స్, కామెంట్లు చేసిన వారిపై దగ్గరుండి చర్యలు తీసుకున్నాడు.ఏకంగా పోలీసు వాళ్లకు చెప్పి మరి రచ్చ చేశాడు.తన పైన కాకుండా తన భార్య పిల్లలపై కూడా కామెంట్లు చేశారని కోపంతో రగిలిపోయాడు.
తన భార్య నిత్య కూడా తమపై నెగటివ్ కామెంట్లు చేసిన వారికి గట్టి కౌంటర్ ఇచ్చింది.యాంకర్ రవి మొదట్లో తన భార్య గురించి ఎవరికి చెప్పనేలేదు.
కనీసం తనకు పెళ్లి అయిందని కూడా దాచి పెట్టాడు.ఆ తర్వాత కొంత కాలానికి తనకు పెళ్లి జరిగిందని, వియా అనే పాప కూడా ఉందని చెప్పాడు.
వారిని సోషల్ మీడియా వేదికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు.ఇక వాళ్ళు బుల్లితెరపై పలు షోలలో వచ్చి బాగా సందడి చేశారు.
రవి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా తన భార్య, బిడ్డ రాగా ఆ ఎపిసోడ్ మాత్రం బాగా హైలెట్ గా మారింది.
ఈ మధ్య రవి మరింత యాక్టివ్ గా మారాడు.ఇంటర్వ్యూలలో పాల్గొని అందరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.తన భార్యతో ఎంటర్టైన్మెంట్ షోలలో కూడా పాల్గొంటున్నాడు.
సోషల్ మీడియాలో కూడా ఫుల్ బిజీ గా మారాడు.తాజాగా సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ లు షేర్ చేశాడు.
రవి భార్య నిత్య బర్త్ డే సందర్భంగా తన స్నేహితులను పిలిచి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు.
అందులో యాంకర్ వర్షిణి, అనీ మాస్టర్ ఉండగా వారిద్దరూ కలిసి డాన్స్ తో రచ్చ చేస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
ఇక నిత్య పుట్టినరోజు సందర్భంగా ఆమె ఎంతో స్ట్రాంగ్ అని, ఎంతో తెలివైనది అని.ఆమె తన ప్రపంచమని తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు రవి.