నా కెరీర్‌లో కొండా మురళి కంటే బెటర్ సబ్జెక్ట్ 30 ఏళ్లలో దొరకలేదు: రామ్ గోపాల్ వర్మ

కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘కొండా’. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు.

 Director Ram Gopal Varma Talking About Konda Movie Details, Director Ram Gopal V-TeluguStop.com

కొండా మురళి పాత్రలో అదిత్ అరుణ్, సురేఖపాత్రలో ఇర్రా మోర్ కనిపించనున్నారు.కంపెనీ ప్రొడక్షన్ నిర్మిస్తోంది.

చిత్రీకరణపూర్తయింది.ఈ సందర్భంగా వ‌రంగ‌ల్‌లో షూటింగ్ ముగింపు వేడుక జరిగింది.

దీనికి కొండా మురళి, సురేఖ దంపతులు హాజరయ్యారు.

ఈ పార్టీకి రామ్ గోపాల్ వర్మ నక్సలైట్ గెట‌ప్‌లో వచ్చారు.

అంతే కాదు… ‘కొండా’, ‘బలుపెక్కిన ధనికుడా… కాల్ మొక్కుడు లేదిక’ పాటలకు ఆయన పర్ఫార్మెన్స్ చేశారు.హీరో అదిత్ అరుణ్, ఇతర నటీనటులతో కలిసి స్టెప్పులు వేశారు.

రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ “సినిమా స్టార్ట్ చేసేముందు నేను కొండా మురళి పేరువినలేదు.ఓ ఎన్నికల సమయంలో కొండా సురేఖ పేరు విన్నాను.

ఆమె ఇంటర్వ్యూలు చూశా.నేను రాజకీయాలు ఫాలో అవ్వను.

నాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు.నేను ముంబైలో ‘సత్య’,’కంపెనీ’, ఇక్కడ ‘రక్త చరిత్ర’ తీసినప్పుడు గానీ తెలంగాణలో సాయుధపోరాటం గురించి తెలియదు.

ఒక వ్యక్తి చెప్పారు.

అప్పుడు ఆయన గురించి రీసెర్చ్ చేశా.ప్రతి కథకు, సినిమాకు ఓ క్యారెక్టర్ ఉంటుంది.ఉదాహరణకు… హిట్లర్ లేకపోతే రెండోప్రపంచ యుద్ధం, గాంధీజీ లేకపోతే భారత స్వాతంత్య్ర పోరాటానికి అర్థమే లేదు.గాంధీ ఒక వైపు, హిట్లర్ మరోవైపు ఉంటే కొండా మురళి మధ్యలో ఉన్నారు.త‌నను జైలులో చంపేస్తారా? అనేదాన్ని ఎదుర్కొని, చావుతో ఆడుకుని, నేడు ఇక్క‌డ కూర్చున్నారు.

కొండాముర‌ళి ఎక్స్‌పీరియ‌న్స్‌లు విని నేను విప‌రీతంగా ప్ర‌భావితం అయ్యాను.నాకు హిట్లర్, ముస్సోలిని, ప్రభాకరన్ నేపథ్యాలు తెలుసు.

వీళ్లందరూ నమ్మిన సిద్ధాంతాలు, విలువలకోసం పోరాడతారు.అటువంటి అంశం నాకు కొండా మురళి జీవితంలో దొరికింది.

అదిపట్టుకుని, ఆ తాడును పట్టుకుని తీశా.ఈ రోజు నాకు సాయుధ పోరాటం, నక్సలైట్ల గురించి తెలుసు.

కొండా మురళి, సురేఖ జీవితాలను ఎంపిక చేసుకోవడానికి కారణం… వాళ్ల నేపథ్యంలో ఈ కథ చెప్పడానికి అద్భుత అవకాశం దొరికింది.

Telugu Adit Arun, Biopic, Ram Gopal Varma, Irra Moor, Konda, Konda Murali, Konda

అందుకని, సినిమాకు ‘కొండా’ పేరు పెట్టాను.ప్రమాదాన్ని కొండా మురళి కోరి తెచ్చుకున్నారు.ప్రమాదం వస్తుందని భయపడలేదు.

దాన్ని చూసి స్ఫూర్తి పొంది సినిమా తీశా.కొండా మురళి జీవించిన జీవితమే నా సినిమా కథ.కొండా మురళి శత్రువులు, కొంత మంది పోలీసులను కలిసి వాళ్లు చెప్పినది విన్న తర్వాత నాకు ఓ క్లారిటీ వచ్చింది.నా కెరీర్‌లో కొండా మురళి కంటే బెటర్ సబ్జెక్ట్ 30 ఏళ్లలో దొరకలేదు.

నేను అనుకున్నది 20 శాతం తీసినా నా కెరీర్‌లో బెస్ట్ఫిల్మ్ అవుతుంది” అని అన్నారు.

కొండా మురళి మాట్లాడుతూ “రామ్ గోపాల్ వర్మ గురించి ఏమనుకుంటారో, కొండా మురళిగురించి కూడా ప్రజలు అదే అనుకుంటారు… ‘ఎవరి మాట వినరు’ అని! నేను మాటవినను.

కానీ, జనాలకు సేవ చేస్తా.మాట తప్పను, మడమ తిప్పను.పని మాత్రం చేసిపెడతా.ఈ రోజు వరకు ఇలా బతుకుతున్నామంటే ప్రజలే కారణం.

బాల్ థాకరే, అమితాబ్​బచ్చన్ నుంచి మొదలు పెడితే… పెద్ద పెద్ద హీరోలతో వర్మ పని చేశారు.ఆ స్థాయిలో కొండామురళిని తీసుకు రావాలని ఈ సినిమా చేశారు.

ప్రజల కోసం నేను ఎంత తపన పడతానో… సినిమా కోసం వర్మ అంత తపన పడ్డారు.వర్మను మా కుటుంబ సభ్యుడిలా చూసుకుంటామని ప్రజల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను.

ఆయన ఏ కల్మషం లేనివ్యక్తి.నా పాత్రలో అదిత్ అరుణ్ బాగా నటించారు.

ఆయన్ను చూస్తే నన్ను చూసినట్టుఉంది.నా మీద ఫైరింగ్ అయ్యే సీన్ చూస్తే… నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

అది చూడలేకపక్కకి వెళ్లాను.సినిమా మరో మూడు పార్ట్స్ తీయాలని కోరుతున్నాను” అని అన్నారు.

Telugu Adit Arun, Biopic, Ram Gopal Varma, Irra Moor, Konda, Konda Murali, Konda

కొండా సురేఖ మాట్లాడుతూ “సినిమా ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ సింహం అయితే… రాజకీయాల్లో కొండా మురళి సింహం.మురళి గారి బయోపిక్ చేయాలని చాలా రోజులుగా మా కోరిక.గుణశేఖర్ గారిని కలిసినప్పుడు నేను, మా అమ్మాయి మా మనసులో మాటచెప్పాం.ఆయన ఒక్కటే మాట అన్నారు… ‘మీ బయోపిక్ తీయాలంటే ఆర్జీవీ సారే తీయాలి.ఆయన షూటింగులో ఉండి తీయాలి.అప్పుడే క్లిక్ అవుతుంది’ అన్నారు.

అప్పుడు మాకు ఆర్జీవీ అన్నను కలిసే అవకాశం రాలేదు.ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో వాళ్లిద్దరూ కలిశారు.‘కొండా’ తెరకెక్కింది.ఒక తపస్సులా ఆర్జీవీ ఈ సినిమా తీశారు.

ఆయన పనులన్నీ వదిలేసి… రోజుల తరబడి వ‌రంగ‌ల్‌లో ఉండి సినిమా తీశారు.మా జీవితం రెండున్నరగంటల్లో చూపించే సినిమా కాదు.

వర్మకు కథ మొత్తం తెలుసు.రెండున్నర గంటల్లో పదిశాతం జీవితాన్ని తీసుకొచ్చినా సంతోషపడతానని వర్మ చెప్పారంటే… మా జీవితం ఎలాఉండేదో అర్థం చేసుకోండి.

పులి కడుపులో పులే పుడుతుంది.నా కూతురు పులి.

Telugu Adit Arun, Biopic, Ram Gopal Varma, Irra Moor, Konda, Konda Murali, Konda

ఏడేళ్లనుంచి తను ఎన్నో కష్టాలు పడింది.మా కుటుంబాలు కూడా ఎన్నో బాధలు పడ్డాయి.భవిష్యత్తులో వాటిని వేరే రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వర్మ చెప్పారు.ఇప్పుడు ట్రైలర్ చూపించారు.అందులో లీనం అయ్యా.సినిమా ఎలా తీశారో చెప్పనవసరం లేదు.

కొండా మురళి జీవితం చాలా మందికి తెలియదు.మేం ముళ్లబాటమీద నడిచి ఈ స్థాయికి వచ్చాం.

మేం ఈ స్థాయికి ఎదగడానికి ప్రజలు కారణం.ఈసినిమాతో ప్రజలకు తెలుస్తుంది.

వర్మ మా సినిమా తీయడం అదృష్టంగా భావిస్తున్నాను.హీరో హీరోయిన్లు, ఆర్టిస్టులు బాగా చేశారు” అని అన్నారు.

అదిత్ అరుణ్ మాట్లాడుతూ “కొండా మురళి, సురేఖ గారి ఆతిథ్యానికి థ్యాంక్స్.మమ్మల్ని మంచిగా చూసుకున్నారు.

వరంగల్ రెండు చేతులతో ఆహ్వానించి, హత్తుకుని, బాగా చూసుకుంది.మా నాన్నగారి ఫస్ట్ పోస్టింగ్ వరంగల్ లో అంట.నేను సినిమా షూటింగ్​ కోసం వచ్చాను.‘కొండా’ విడుదల తర్వాత మళ్లీ వస్తాను.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube