తెలుగు సినిమా పరిశ్రమ అప్పట్లో మద్రాసులో ఉండేది.కారణం.
అప్పట్లో ఆంధ్ర, మద్రాసు రాష్ట్రాలు కలిసి ఉండేవి.అయితే తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి అవార్డులు తీసుకునేందుకు ఏ నటుడు వెళ్లినా వారిని మద్రాసీలుగానే చూసేవారు.
ఓసారి అవార్డు అందుకునేందుకు వెళ్లిన ఏఎన్నార్ కు కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది.ఆ సమయంలో తను హైదరాబాద్ లో సినిమా పరిశ్రమను ఏర్పాటు చేయాలని బలంగా ఫిక్స్ అయ్యాడు.
ఆ సమయంలో హైదరాబాద్ లో సారథి స్టూడియో మాత్రమే ఉంది.పైగా అది చాలా చిన్నది.
అయినా సరే నాగేశ్వరరావు తన సినిమా షూటింగులన్నీ సారథి స్టూడియోలోనే చేయించేవాడు.అప్పటికీ ఇండస్ట్రీ మద్రాసులోనే ఉంది.
ఆ సమయంలో అక్కినేని సినిమాల కోసమే ప్రముఖులు హైదరాబాద్ కు వచ్చేవారు.అలా నెమ్మదిగా ఏఎన్నార్ సహకారంతో సారథి స్టూడియో పెద్దగా ఎదిగింది.నిత్యం అక్కడ షూటింగులు జరిగేవి.ఆ సమయంలో అక్కినేని ఆపరేషన్ కోసం ఫారిన్ వెళ్లాడు.అప్పుడే తన ఆరోగ్యం విషమించింది అనే వార్తలు వచ్చాయి.అయితే తనతో తీయాల్సిన సినిమాలను చాలా మంది శోభన్ బాబుతో తీయడం మొదలు పెట్టారు.
సారథి స్టూడియో వాళ్లు కూడా ఏఎన్నార్ కోసం ఉంచిన డేట్లను ఇతర హీరోలకు ఇచ్చింది.ఆరోగ్యం బాగుపడ్డాక.
ఏఎన్నార్ తిరిగి వచ్చారు.
మధ్యలో ఆగిపోయిన తన సినిమా షూటింగులను మళ్లీ మొదలు పెట్టాలి అనుకున్నాడు.కానీ.సారథి స్టూడియోలో తన సినిమాకు కేటాయించిన ఫ్లోర్ ను వేరే హీరోకు ఇచ్చారని తెలిసి తను ఇబ్బంది పడ్డాడు.
వారం రోజులు ఎదురు చూసినా ఇంకా డేట్లు కుదరవని చెప్పారు.వెంటనే ఆయనే స్టూడియోకు వెళ్లాడు.
తనకు ఓ ఫ్లోర్ కావాలని అడిగాడు.యాజమాన్యం మాత్రం ఖాళీగా లేదని చెప్పడంతో బాధ, కోపం వచ్చాయి.
నా వల్ల గొప్పగా ఎదిగిన స్టూడియో.చివరకు నాకే షూటింగ్ కు ఇవ్వరా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.అదే సమయంలో అప్పటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి దగ్గరికి వెళ్లాడు.వీరిద్దరికి మంచి స్నేహం ఉండేది.ఎప్పుడు నవ్వే ఏఎన్నార్.ఆరోజు కోపంగా ఉన్నాడు.
విషయం ఏంటి అని అడిగాడు.హైదరాబాద్ లో స్టూడియో కట్టడానికి స్థలం కావాలి అన్నాడు.
సరే అన్నాడు సీఎం.స్థల కేటాయింపు జరిగింది.
సారథి స్టూడియోకు ధీటుగా అన్నపూర్ణ స్టూడియో ఏర్పాటు అయ్యింది.