బీజేపీతో కలిసే సొంత ఎజెండాతో ముందుకెళ్తున్న ఈటల..!

మాజీ మంత్రి ఈటల రాజేందర్ 6 నెలల ముందర అధికార టీఆర్ఎస్ పార్టీ నేతగా ఉన్నారు.ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు.

 Etala Moving Forward With His Own Agenda To Meet The Bjp . Eetala Rajendhar, Bjp-TeluguStop.com

ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేశారు.దాంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది.

ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే పదవికి పోటీ చేసి విజయం సాధించారు.అలా అధికార టీఆర్ఎస్ పార్టీతో బరిగీసి మరీ కొట్లాడి తన సత్తా చాటుకున్నారు.

బీజేపీ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ గెలిచినప్పటికీ ఆయనకు సొంత ఎజెండ ఉందని ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో చర్చ జరగుతోంది.అయితే, ఈటల గెలుపుతో తెలంగాణ బీజేపీలో జోష్ అయితే వచ్చింది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలమైన శక్తిగా ఎదిగి, అధికార టీఆర్ఎస్ ను గద్దె దించాలని ఈ క్రమంలోనే కమలనాథులు ప్లాన్ చేసుకుంటున్నారు.ఈ సంగతులు పక్కనబెడితే.

బీజేపీలో ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో ఈటలకు విభేదాలున్నాయని వార్తలొస్తున్నాయి.ఈ వ్యాఖ్యలపై ఈటల తాజాగా స్పందించారు.

తనకు సంజయ్‌తో కానీ కిషన్ రెడ్డితో కానీ ఎటువంటి విభేదాలు లేవని తెలిపారు.అయితే, అధిష్టానాన్ని కాదని ఈటల తనకంటూ సొంత ఎజెండా ఏర్పరచుకున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Telugu Bandi Sanjay, Karimnagar, Kishan Reddy, Mlc, Trs, Ts Potics-Telugu Politi

ఆ ఎజెండాలో భాగంగానే కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంజయ్ ప్రకటించిన నిర్ణయాన్ని కాదని రెబల్ క్యాండిడేట్ సర్దార్ రవీందర్ సింగ్ కు మద్దతు తెలిపారని అంటున్నారు.ఇకపోతే తనను పార్టీ ఆదేశిస్తే సీఎం కేసీఆర్‌పైన పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.అలా మొత్తంగా ఈటల రాజేందర్ బీజేపీలో ఉన్నప్పటికీ తనకంటూ సొంత బలం, సొంత వ్యూహాలు రచించుకున్నారేమోననే అభిప్రాయం.ఆయన చర్యలు చూస్తుంటే అర్థమవుతున్నదని కొందరు రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube